Begin typing your search above and press return to search.

ప‌చ్చ కోక‌లో ఐశ్వ‌ర్య అందానికి మునీశ్వ‌రుడైనా చ‌లించాలి!

By:  Tupaki Desk   |   15 April 2023 8:00 AM GMT
ప‌చ్చ కోక‌లో ఐశ్వ‌ర్య అందానికి మునీశ్వ‌రుడైనా చ‌లించాలి!
X
సిల‌కాకు ప‌చ్చ సీర‌లోన సంపుతున్న‌ సిన్న‌ది.. ఇంత‌కీ ఎవ‌రీ సిన్న‌ది? .. పేరు ఐశ్వ‌ర్య మీన‌న్. సైలెంట్ గా టాలీవుడ్ లో బిజీ స్టార్ అయిపోయింది ఈ బ్యూటీ. ద‌శాబ్ధం క్రితం ల‌వ‌ర్ బోయ్ సిద్ధార్థ్ స‌ర‌స‌న ల‌వ్ ఫెయిల్యూర్ అనే చిత్రంతో ప‌రిచ‌య‌మైన ఈ బ్యూటీకి ఆ సినిమా ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు.

త‌మిళం క‌న్న‌డ ‌లోను కొన్ని సినిమాలు చేసింది. మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌ర‌స‌న‌ ధ‌మాకాలో జ‌స్ట్ ఛాన్స్ మిస్స‌యింది. కానీ కార్తికేయ 2తో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన నిఖిల్ స‌ర‌స‌న `స్పై` మూవీలో న‌టించే అవ‌కాశం ద‌క్కించుకుంది. టైటిల్ కి త‌గ్గ‌ట్టే గూఢ‌చారిగా నిఖిల్ మ‌రో లెవ‌ల్ ఏంటో చూపించ‌బోతున్నాడ‌ని టాక్ ఉంది. ఈ చిత్రంలో ఐశ్వ‌ర్య‌కు న‌ట‌న‌కు స్కోప్ ఉందిట‌. మ‌రోవైపు ఐశ్వ‌ర్య మీన‌న్ కి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ఓ ఆఫ‌ర్ ఇచ్చార‌ని కూడా ప్ర‌చారం సాగుతోంది. కానీ దానికి అధికారికంగా వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది.

ఇంత‌లోనే ఐశ్వ‌ర్య లేటెస్ట్ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో గుబులు రేపుతోంది. చిల‌కాకు ప‌చ్చ చీర‌లో ఐశ్వ‌ర్య ఎంతో ముగ్ధ‌మ‌నోహ‌రంగా క‌నిపిస్తున్న ఈ ఫోటోగ్రాఫ్ యువ‌త‌రంలో జోష్ నింపుతోంది. చేతికి గాజులులేవు.. ముఖానికి మేక‌ప్ అతిగా లేదు. చెరిగిన శిరోజాల‌తో క‌నిపిస్తోంది సింపుల్ గా. అయినా తీరైన షేపుల‌తో కుర్ర‌కారు గుండెల్లో వ‌ల‌పురాణిగా మారింది ఐశ్వ‌ర్య‌. నిజానికి ఈ రూపం కోసం నిరంత‌రం జిమ్ యోగా అంటూ చాలా శ్ర‌మిస్తోంది. అందుకు సంబంధించిన సోష‌ల్ మీడియా వీడియోలు ఇటీవ‌ల వైర‌ల్ అయ్యాయి. తాజాగా ట్రెడిష‌న‌ల్ శారీలోను ఎంతో అందంగా గ్లామ‌ర్ ఎలివేష‌న్ కి ఏమాత్రం అడ్డు చెప్ప‌ని భామ‌గా త‌న‌ని తాను ఎలివేట్ చేసుకున్న ఈ భామకు టాలీవుడ్ లో మంచి భ‌విష్య‌త్ ఉంద‌న‌డంలో సందేహం లేదు. ప‌చ్చ కోక‌లో ఐశ్వ‌ర్య అందానికి మునీశ్వ‌రుడైనా చ‌లించాలి! అంటూ ఓ అభిమాని తాజా ఫోటోషూట్ పై వ్యాఖ్య‌ను జోడించాడు.

ఇండ‌స్ట్రీ ఒక చ‌ద‌రంగం. ఇక్కడ పావులు క‌దిపే విధానాన్ని బ‌ట్టి అవ‌కాశాలొస్తాయి. పాము నిచ్చెన‌ల ఆట‌లో ఐశ్వ‌ర్యా మీన‌న్ ఇంకా ఏ మెట్టుపై ఉందో చెప్ప‌లేం. ఇన్నాళ్లు వెన‌క‌బ‌డినా ఈసారి తెలివైన ఎత్తుగ‌డ‌ల‌తో ముందుకు సాగుతుంద‌ని నిచ్చెన‌లు ఎక్కుతుంద‌ని ఆశిద్దాం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.