Begin typing your search above and press return to search.

జాన్వీ కపూర్.. ఇలా అయితే కష్టమే

By:  Tupaki Desk   |   19 Jun 2022 11:40 AM GMT
జాన్వీ కపూర్.. ఇలా అయితే కష్టమే
X
అందాల తార శ్రీదేవి తెలుగులో ఒకప్పుడు ఏ స్థాయిలో గుర్తింపు అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్నేళ్ల వరకు అగ్రహీరోయిన్ గా చెలామణి అయిన శ్రీదేవిని ఇప్పటికి కూడా ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. సౌత్ ఇండస్ట్రీ లోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా అగ్రతారగా అత్యధిక స్థాయిలో పారితోషికం అందుకుంది. అయితే అలాంటి శ్రీదేవి ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయి వస్తుంది అంటే తప్పకుండా ఆమె కూడా భాషతో సంబంధం లేకుండా సక్సెస్ అవుతుందని అనుకున్నారు.

ఇక శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ మాత్రం అందుకు భిన్నంగా తన కెరీర్ ను ప్లాన్ చేసుకోవడం కొంత నిరాశను కలిగించింది. ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఫోకస్ చేసి మధ్యలో తెలుగు ఆఫర్స్ వచ్చినా కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే ఆమె టాలీవుడ్ ను ఒక విధంగా తక్కువ చూపు చూసినా బాలీవుడ్ లో అయితే పెద్దగా బాక్సాఫీసు వద్ద సక్సెస్ అయ్యేంత సినిమాలు ఏమీ దొరకలేదు.

మొదటి సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో ఆ తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా థియేటర్ లో పెద్దగా సందడి చేయలేదు. ఎక్కువగా ఆమె నటించిన సినిమాలు ఓటీటీ కి పరిమితమవుతున్నాయి. గుంజన్ సక్సేనా, ఘోస్ట్ స్టోరీస్ డైరెక్ట్ డిజిటల్ లో వచ్చేశాయి. ఇక నయనతార కోకో కోకిల రీమేక్ గుడ్ లక్ జెర్రీ కూడా అలానే రిలీజ్ అయ్యింది. ఇటీవల మరో మళయాలం మూవీ హెలెన్ ని జాన్వీ మిలిగా రీమేక్ చేసింది. దీనిపై కూడా పెద్దగా అంచనాలు ఏమీ లేవు.

నవంబర్ లో పూర్తి చేసిన సినిమాపై ఇప్పటిదాకా రిలీజ్ అప్డేట్ లేదు. చేతిలో ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహీ, బవాల్ అనే సినిమాలు ఉన్నాయి అంతే. ఇక కనీసం తెలుగులో ఆమె కొన్ని సినిమాలు చేసి ఉంటే ఇప్పటికీ ఏదో ఒక మంచి గుర్తింపును అందుకొని ఉండేది. దిల్ రాజు పూరి జగన్నాథ్ లాంటి వారు కూడా ఆమెను సంప్రదించినప్పటికీ అనవసరం అని కాస్త ఓవర్ గా ఆలోచించింది. ఇక ఆమె హిందీలో చేస్తున్న సినిమాలు థియేటర్ వరకు రావడమే పెద్ద సందేహంగా మారింది. దీంతో శ్రీదేవి బ్రాండింగ్ కాస్త అందరూ మర్చి పోయే సమయానికి ఏదో ప్రయత్నాలు చేస్తోంది కానీ అవి మీ అంతట వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. ఏది ఏమైనా కూడా జాన్వీ కపూర్ అనవసరంగా లెవెల్ చూపించి తన స్టార్ హోదాను తగ్గించుకుంది అనే కామెంట్స్ ఎక్కువగానే వస్తున్నాయి.