Begin typing your search above and press return to search.
నా గురించి తప్పుగా రాస్తే ఊర్కుంటానా?
By: Tupaki Desk | 14 Jan 2022 11:30 PM GMTతెలుగు తెరకి 70వ దశకంలో పరిచయమైన అందమైన కథానాయికలలో జయచిత్ర ఒకరు. జయచిత్ర తెలుగులో చాలా సినిమాలో చేశారు. అయినా ఆమె పేరు వినగానే 'సోగ్గాడు' సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమాలో ఆమె చేసిన సందడి కళ్లముందు కదలాడుతుంది. ఇక అప్పట్లో మురళీ మోహన్ తో కలిసి ఆమె చేసిన సినిమాలకు మంచి ఆదరణ లభించింది. అలాంటి సినిమాలలో 'చిల్లరకొట్టు చిట్టెమ్మ' .. 'కల్పన' కనిపిస్తాయి. తెలుగుతో పాటు తమిళ .. కన్నడ సినిమాల్లో కథానాయికగా మంచి పేరు తెచ్చుకున్న ఆమె తాజా ఇంటర్వ్యూలో మాట్లాడారు.
"అప్పట్లో ప్రతి హీరోకి ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉండేది. మురళీమోహన్ గారితో చాలా సినిమాలు చేశాను. మొదట్లో ఒక సినిమా షూటింగులో ఆయన నా చేయి పట్టుకోవడానికి చాలా భయపడ్డారు. అప్పుడు ఆయన చేయిని నేను పట్టుకున్నాను. "ఎందుకు భయపడతారు .. ఇదంతా యాక్టింగ్. అటు చూడండి కెమెరా ఉంది .. వందమంది ఉన్నారు" అంటూ ధైర్యం చెప్పడంతో ఆయనలో కాస్త బెరుకు తగ్గింది. కెరియర్ ఆరంభంలో కనుక అలా జరిగింది. ఆ తరువాత మేమిద్దరం కలిసి చాలా హిట్లు ఇచ్చాము.
అప్పట్లో నేను .. మురళీమోహన్ గారు ఎక్కువ సినిమాలు చేయడం వలన, మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్టు ఒక మేగజైన్ లో రాశారు. 'ముద్దబంతి పువ్వు' సినిమా షూటింగు కోసం నేను .. మురళీ మోహన్ గారు .. దాసరి నారాయణరావు గారు ఫ్లైట్ లో వెళుతున్నాము. అప్పుడు దాసరి నారాయణ రావు గారు ఆ మేగజైన్ చూసి, "ఏవయ్యా మురళీమోహన్ నువ్వు జయచిత్రను పెళ్లి చేసుకుంటున్నావట" అని నవ్వుతూ అడిగారు. ఆ మాట వినగానే మేమిద్దరం షాక్ అయ్యాము. ఎలాంటి రూమర్ ఎలా వచ్చిందా అనుకున్నాము.
ఆ తరువాత ఆ ఫాల్స్ న్యూస్ రాసిన వ్యక్తికి నేను చుక్కలు చూపించాను. నన్ను అడక్కుండా ఎలా రాశావు అని చెప్పేసి నిలదీశాను. ప్రూఫ్ లేకుండా ఎలా వేశారు? అని క్లాస్ పీకాను. నీ కూతురు గురించి నువ్వు ఇలా రాస్తావా? మీ ఇంట్లో వాళ్లను గురించి ఇలా తప్పుడు వార్తలు రాస్తావా? అని అడిగాను. అప్పుడు ఆయన నాకు సారీ చెప్పారు. ఆ మేగజైన్ వారు ఆయనను పనిలో నుంచి తీసేస్తామని అన్నారు. అలా చేయవద్దని నేనే అన్నాను. ఆ వార్తలో నిజం లేదు కనుక, ఆ తరువాత ఆ విషయాన్ని గురించి పట్టించుకోలేదు" అని చెప్పుకొచ్చారు.