Begin typing your search above and press return to search.
పాడు పని చేయాలని ఆ నటిని వేధిస్తున్నారట
By: Tupaki Desk | 14 July 2018 4:31 AM GMTగ్లామర్ రంగంలో ఉన్న వారికుండే పేరు ప్రఖ్యాతులు చూసి చాలామంది అసూయపడుతుంటారు. వారికేం.. లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారంటూ పీలయ్యే వారు చాలామందే ఉంటారు. అయితే.. ఈ గ్లామర్ తెచ్చే తిప్పలు ఎంతలా ఉంటాయన్న విషయం ఆ రంగంలో ఉండే కొందరు అప్పుడప్పుడు బయటపెడుతుంటారు.
తాజాగా అలాంటి విషయాన్ని ఓపెన్ గా చెప్పి సంచలనం సృష్టించారు కోలీవుడ్ నటి జయలక్ష్మి. సుమారు 30 సినిమాల్లో నటించిన ఆమెకు తమిళనాట మంచి పేరే ఉంది.ఈ మధ్యన ఆమె ఫోన్ కు ఒక మేసేజ్ వచ్చింది. అందులో.. మీరు మంత్రులు.. వీఐపీలతో డేటింగ్ చేయాలనుకుంటున్నారా? కింద పేర్కొన్న రిలేషన్ షిప్ డేటింగ్ సర్వీస్ కు ఫోన్ చేయండి.. రోజుకు రూ.30వేల నుంచి రూ.3లక్షలు తేలిగ్గా సంపాదించుకోవచ్చని ఉంది.
అది చూసినంతనే ఆగ్రహం కలిగినా.. ఏం చేయగలమని కామ్ గా ఉండిపోయారు. ఆ తర్వాత నుంచి ఆ డేటింగ్ సంస్థ ప్రతినిధులమంటూ ఇద్దరు వ్యక్తులు అదే పనిగా ఆమెకు ఫోన్లు చేయటం మొదలు పెట్టారు. ఆమెతో ఉల్లాసంగా గడిపేందుకు పలువురు రాజకీయ ప్రముఖులు.. బిజినెస్ మ్యాన్లు సిద్ధంగా ఉన్నారని.. మీరు ఓకే అంటే రూ.30 లక్షలు అడ్వాన్స్ ఇస్తామంటూ చెప్పారు. దీంతో.. ఒళ్లు మండిన ఆమె.. తాజాగా చెన్నై పోలీసు కమిషనర్ ఏకే విశ్వనాధన్ ను కలిసి కంప్లైంట్ ఇచ్చారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు బ్రోకర్ల సెల్ ఫోన్ నెంబర్ల ఆధారంగా వారిని అదుపులోకి తీసుకున్నారు. షాకింగ్ విషయం ఏమిటంటే.. ఆ బ్రోకర్ల సెల్ ఫోన్లో సుమారు 70 మంది తమిళ సినీ.. టీవీ హీరోయిన్ల ఫోటోలు.. వారి ఫోన్ నెంబర్లు.. వారితో డేటింగ్ కు చెల్లించాల్సిన అమౌంట్ ఉన్నాయి. ఈ వివరాల్ని చూసిన పోలీసులు షాక్ తిని.. విచారణ జరుపుతున్నారు. మరీ.. ఉదంతంలో మరెన్ని షాకింగ్ అంశాలు బయటకు వస్తాయో చూడాలి.