Begin typing your search above and press return to search.

ప్రముఖ నటి ఆరోగ్య పరిస్థితి సీరియస్‌!!

By:  Tupaki Desk   |   9 July 2020 5:15 AM GMT
ప్రముఖ నటి ఆరోగ్య పరిస్థితి సీరియస్‌!!
X
ప్రముఖ నటి జయంతి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత కొన్నాళ్లుగా దీర్ఘ కాలిక అనారోగ్యంతో బాధపడుతున్న జయంతి తాజాగా ఆరోగ్యం మరింతగా విషమించడంతో ప్రస్తుతం బెంగళూరులోని ప్రముఖ హాస్పిటల్‌ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. జయంతికి ప్రస్తుతం వెంటిలేటర్‌ పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లుగా వైధ్యులు పేర్కొన్నారు. సుదీర్ఘ కాలంగా అస్తమతో బాధపడుతున్న జయంతి ఇటీవల శ్వాస సంబంధిత సమస్య మరింత ఎక్కువ అవ్వడంతో కోవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో ఆమెకు నెగటివ్‌ వచ్చినట్లుగా వైధ్యులు పేర్కొన్నారు.

జయంతి కర్ణాటకకు చెందినప్పటికి తెలుగులో పలు చిత్రాల్లో నటించారు. కన్నడ సినిమాతో హీరోయిన్‌ గా పరిచయం అయిన జయంతి ఆ తర్వాత తెలుగు హిందీ ఇంకా తమిళ చిత్రాల్లో కూడా నటించి మెప్పించాను. దాదాపుగా 500 సినిమాలు చేసిన జయంతి అందులో 300 సినిమాల్లో హీరోయిన్‌ గా నటించారు. తెలుగులో ఈమె చేసిన అనేక పాత్రలు మరియు సినిమాల కారణంగా తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గర అయ్యారు. అంతా కూడా జయంతి తెలుగు నటి అయ్యి ఉంటుందని అనుకునే స్థాయిలో ఆమె తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిపై తెలుగు సినీ పరిశ్రమ వారితో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో కోలుకుని తిరిగి ఇంటికి చేరుకోవాలంటూ తెలుగు సినిమా ప్రముఖులు ఇంకా ప్రేక్షకులు కోరుకుంటున్నారు.