Begin typing your search above and press return to search.

భ‌య‌ప‌డితే `మా` పాల‌న ఎలా?

By:  Tupaki Desk   |   18 March 2019 5:47 AM GMT
భ‌య‌ప‌డితే `మా` పాల‌న ఎలా?
X
ప్ర‌తిష్ఠాత్మ‌క‌ మూవీ ఆర్టిస్టుల సంఘం (మా)లో అస‌లేం జ‌రుగుతోంది? గొడ‌వ‌లు సద్ధుమ‌ణిగేందుకు ఆస్కారం లేదా? ఇవ‌న్నీ వ్య‌క్తిగ‌త క‌క్ష‌ల‌కు సంబంధించిన‌వా? ఎందుకీ పిత‌లాటం? ప‌్ర‌స్తుతం ఆర్టిస్టుల్లో సాగుతున్న ఆస‌క్తిర‌క చ‌ర్చ ఇది. కార‌ణం ఏదైనా 800 మంది స‌భ్యులు ఉన్న `మా` కుటుంబంలో క‌ల‌త‌ల వ‌ల్ల కొన్ని ఇబ్బందులు త‌ప్ప‌డం లేద‌ని తెలుస్తోంది. వ్య‌వ‌స్థ స్థంభించిన‌ప్పుడు ఆ మేర‌కు ప‌నులు ఆగిపోయే స‌న్నివేశం ఉంటుంది. ప్ర‌స్తుతం 10 రోజులుగా అలాంటి సందిగ్ధ‌తే నెల‌కొంద‌ని చెబుతున్నారు. వివ‌రాల్లోకి వెళితే..

ఈనెల 10న జ‌రిగిన మూవీ ఆర్టిస్టుల ఎన్నిక‌ల‌ ర‌స‌వ‌త్త‌ర పోరులో `మా` కొత్త అధ్య‌క్షుడిగా సీనియ‌ర్ న‌రేష్ ఎన్నికైన సంగ‌తి తెలిసిందే. ఇరు ప్యానెల్స్ నుంచి కొంద‌రు స‌భ్యులు కొత్త క‌మిటీకి ఎన్నిక‌య్యారు. అయితే నూత‌న క‌మిటీ ఇంకా ప్ర‌మాణ స్వీకారాలు చేయ‌లేదు. చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈనెల 22న ప‌ద‌వులు చేప‌ట్టాల‌ని అధ్య‌క్షుడు న‌రేష్, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జీవిత త‌దిత‌రులు ఈవెంట్ కోసం ప్లాన్ చేశారు. కానీ అనూహ్యంగా అది వాయిదా వేసుకోవాల్సి వ‌చ్చింది. మార్చి 31 వ‌ర‌కూ ప‌ద‌వీ కాలం ఉంద‌ని శివాజీ రాజా ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ వారికి విన్న‌వించారు. ఆ క్ర‌మంలోనే ఇది వివాదాస్ప‌దం అయిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్య‌వ‌హారంలో శివాజీ రాజా వ్య‌వ‌హారంపై సీనియ‌ర్ న‌రేష్ - జీవిత బృందం మీడియా ముందుకు ఆరోప‌ణ‌లు చేశారు. దీంతో మ‌రోసారి గొడ‌వ ర‌చ్చ‌కెక్కింది.

దీనిపై జీవిత స్పందిస్తూ.. మాలో జ‌రుగుతున్న వివాదాల వ‌ల్ల ఏం జ‌రుగుతోందోన‌ని భ‌యంగా ఉంది. భ‌విష్య‌త్ లోనూ మేం ఛార్జ్ తీసుకున్నాక గొడ‌వ‌లొస్తాయ‌నే భావిస్తున్నామ‌ని అన్నారు. ఈనెల 22న ప్ర‌మాణ స్వీకారం చేయాల‌ని భావిస్తే శివాజీ రాజా అడ్డు ప‌డ్డారు. దీనివ‌ల్ల ప‌నులు ఆగిపోయాయి. టెర్మ్ అయిపోయిన ఇన్సూరెన్సుల్ని రెన్యువ‌ల్ చేయాలి. ఆర్టిస్టుల స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం వెత‌కాల్సి ఉంది. ఇలాంట‌ప్పుడు అడ్డంకులు ఏర్ప‌డ్డాయి అంటూ ఆరోపించారు. మొత్తానికి మూవీ ఆర్టిస్టుల సంఘంలో గొడ‌వ‌ల‌కు ఇప్ప‌ట్లో ఎండ్ కార్డ్ ప‌డేట్టు క‌నిపించ‌డం లేదని తాజా స‌న్నివేశం చెబుతోంది. కుటుంబంతో పాటే అరుణాచ‌లం వెళ్లిపోతాన‌న్న శివాజీ రాజా ఎందుకిలా అడ్డుప‌డుతున్నారు? అని జీవిత ప్ర‌శ్నించ‌డం చూస్తుంటే గొడ‌వ ఇంకా స‌ద్ధుమ‌ణ‌గ లేదనే అర్థ‌మ‌వుతోంది.