Begin typing your search above and press return to search.

సెలబ్స్‌ కాపురాలుపై జ్యోతిక ఎనాలసిస్‌

By:  Tupaki Desk   |   14 April 2015 11:20 AM GMT
సెలబ్స్‌ కాపురాలుపై జ్యోతిక ఎనాలసిస్‌
X
లక లక లక.. అంటూ విస్మయానికి గురిచేసే నటన చూపించింది జ్యోతిక. చంద్రముఖిగా తన అభినయాన్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. అయితే కెరీర్‌ పీక్‌లో ఉండగానే హీరో సూర్యని పెళ్లాడి సంసార జీవనానికి పరిమితమైపోయింది. దాదాపు ఏడేళ్ల పాటు ముఖానికి రంగేసుకోకుండా ఉండిపోయింది. ఇప్పుడు రి-ఎంట్రీ షురూ

ఇప్పుడు భర్త సూర్య నిర్మాతగా తెరకెక్కించిన 36వయదినిలే చిత్రంతో మరోసారి తమిళ్‌, తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా జ్యోతిక దాంపత్య జీవనంలో సుఖసంసారం గురించి చెప్పిన సప్తపదులివి...

= భార్య భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఏడేళ్ల దాంపత్య జీవనంలో ఎన్నో. ప్రతి సందర్భంలో అర్థం చేసుకుని కాపురాన్ని నిలుపుకున్నాం.

= షూటింగుల ఒత్తిడి ఎలా ఉంటుందో తెలుసు. అందుకే వృత్తిగతంగా ఒత్తిళ్లను తెలుసుకోవడం ముఖ్యం. సూర్య ఎంత బిజీనో తెలిసినదానిగా తనకి అన్నివిధాలా సహకరించాను.

= భార్యా భర్తల సంతోషం పెరగాలన్నా, బాంధవ్యం బావుండాలన్నా పిల్లల్ని కనడం ముఖ్యం. వారితో స్పెండ్‌ చేయడం అవసరం. సుఖసంసారం సాగించాలంటే పిల్లలు తప్పనిసరి.

= అప్పుడప్పుడు తీరిక సమయాలు చిక్కినప్పుడు కలిసిమెలిసి ప్రయాణాలు చేయడం చాలా ముఖ్యం. విదేశీ ట్రిప్‌లు వెళ్లడం.. కుదరకపోతే దగ్గర్లోని ఏదైనా మంచి ప్లేస్‌కి వెళ్లడం చాలా ముఖ్యం.

= జీవితంలో, కెరీర్‌లో చేదు నిజాలేవైనా ఉంటే ఓపెన్‌గా చెప్పేయడం

భాగస్వామి వ్యక్తిగత అభిప్రాయాల్ని గౌరవించడం, వ్యక్తిగత స్వేచ్ఛనివ్వడం, స్ఫూర్తి నింపడం.

=పొగడ్తలు ముఖ్యం: ఒకరినొకరు పొగుడుకోవడం కూడా అక్కరకొస్తుంది. మంచి పనిచేసినప్పుడు కాంప్లిమెంట్లు ఇవ్వడం, బహుమతులు ఇచ్చుకోవడం బంధాన్ని దృఢతరం చేస్తుంది