Begin typing your search above and press return to search.

టాలీవుడ్ చందమామకి ఇంకాస్త సమయం కావాలట

By:  Tupaki Desk   |   18 Jun 2022 8:30 AM GMT
టాలీవుడ్ చందమామకి ఇంకాస్త సమయం కావాలట
X
టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాలు చేసింది. కాని ఆమె గర్బవతి అవ్వడంతో నాగార్జున సినిమాను వదులుకుంది. అంతే కాకుండా చిరంజీవి సినిమా ను కూడా చేజార్చుకుంది అంటూ వార్తలు వచ్చాయి. కాజల్ అగర్వాల్‌ ప్రస్తుతం అమ్మతనంను ఆస్వాదిస్తూ ఉంది. హీరోయిన్ గా ఆమె బిజీగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని తల్లి అయ్యింది.

ఈమద్య కాలంలో హీరోయిన్స్ పెళ్లియిన తర్వాత మరియు పిల్లలు ఉన్నా కూడా ఆఫర్లు దక్కించుకుంటున్నారు. బాలీవుడ్‌ లో ఐశ్వర్య రాయ్ మొదలుకుని ఎంతో మంది స్టార్‌ హీరోయిన్స్ సెకండ్‌ ఇన్నింగ్స్ ను జెట్‌ స్పీడ్ తో తీసుకు వెళ్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా కాజల్‌ అగర్వాల్‌ కూడా సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టబోతుందనే వార్తలు వచ్చాయి.

చందమామ బ్యూటీ కాజల్ అగర్వాల్‌ తల్లి అయినా కూడా ఆమె అందం ఏమాత్రం తగ్గలేదు అని ఆమె తాజా ఫోటో షూట్‌ ను చూస్తే అర్థం అవుతుంది. అందుకే ఆమెను మళ్లీ తమ సినిమాల్లో నటింపజేసేందుకు ఇద్దరు ముగ్గురు నిర్మాతలు ఆమెను సంప్రదించేందుకు ప్రయత్నించారట. కాని ఆమె సున్నితంగా ఆ ఆఫర్‌ లను తిరష్కరించినట్లుగా సమాచారం అందుతోంది.

ప్రస్తుతం అమ్మతనంను ఆస్వాదిస్తున్న కాజల్ అగర్వాల్ తదుపరి సినిమాను కమిట్ అవ్వడానికి వచ్చే ఏడాది వరకు వెయిట్‌ చేయాలని భావిస్తుందట. గర్బం దాల్చడం వల్ల కాజల్ అగర్వాల్‌ కాస్త వెయిట్‌ పెరిగిన విషయం తెల్సిందే. ఆ కారణంగానే కొన్నాళ్ల పాటు వెయిట్‌ చేసి ఆ తర్వాత సినిమా ల్లో రీ ఎంట్రీ ఇవ్వాలని కాజల్ భావిస్తుందట.

టాలీవుడ్‌ లో దాదాపు యంగ్‌ స్టార్‌ హీరోలు అందరితో కలిసి నటించిన ఈ అమ్మడు చిన్న హీరోలతో కూడా నటించి అత్యధిక హీరోలతో నటించిన ఘనత దక్కించుకుంది.

హీరోయిన్ గా ఈమె చేసిన పాత్రలు కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. అందుకే ఈమె మళ్లీ సినిమాల్లో నటించాలని.. వరుసగా సినిమాలు చేయాలని అది కూడా హీరోయిన్ గా సినిమా లు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. అది వచ్చే సంవత్సరం సాధ్యం అవుతుందని ఆమె సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.