Begin typing your search above and press return to search.

అర్జున్ రెడ్డితో అలనాటి తార రీఎంట్రీ

By:  Tupaki Desk   |   29 Nov 2016 3:30 PM
అర్జున్ రెడ్డితో అలనాటి తార రీఎంట్రీ
X
టాలీవుడ్ కి తొలితరం హీరోయిన్లలో ఒకరైన కాంచన.. సినిమాలు చేయడం మానేసి 30 ఏళ్లు దాటిపోయింది. 1985లో శ్రీ దత్త దర్శనం తర్వాత ఆమె పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. మళ్లీ ఇన్నేళ్లకు ఆమె ఓ మూవీ చేసేందుకు అంగీకరించడం విశేషం. పెళ్లిచూపులు ఫేం విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న అర్జున్ రెడ్డి మూవీలో నటించేందుకు కాంచన ఒప్పుకున్నారు.

'ఆమెను కలుసుకునేందుకే చాలా కష్టం అయింది. కాంచన అంత త్వరగా ఈ సినిమా చేసేందుకు ఒప్పుకోలేదు. చాలాసార్లు కలిసి స్టోరీ వివరించి, ఆమె రోల్ ప్రాధాన్యతను చెప్పాకే ప్రాజెక్టుకు ైన్ చేశారు. ఇందులో కాంచనకు మనవడిగా విజయ్ కనిపించనున్నాడు. ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఓ అర్బన్ గ్రాండ్ మదర్ పాత్ర. బుధఘవారం నుంచి కాంచన షూటింగ్ లో జాయిన్ అవుతారు' అని చెప్పాడు దర్శకుడు సందీప్ వెంగా. కాంచననే ఎందుకు ఎంచుకున్నాడో చెప్పాడు దర్శకుడు.

'ఆమె వయసు 77ఏళ్లు అయినా.. తను 40ల్లో ఉన్నట్లుగా కనిపిస్తారు. కుర్రాళ్లను అర్ధం చేసుకుని.. వారితో ఇంగ్లీష్ ఫ్లుయెంట్ గా మాట్లాడే నానమ్మ పాత్ర చేసేవారి కోసం వెతుకుతున్నపుడు.. తనను ఆ రోల్ లో ఊహించుకుంటే.. సరిగా సరిపోతారు అనిపించింది. అందుకే ఆమెను ఎలాగైనా ఒప్పించాలని అనుకున్నాను' అని చెప్పాడు దర్శకుడు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/