Begin typing your search above and press return to search.

తెల్ల తోలు ఎలుక అంటూ స్టార్ హీరోని తిట్టేసిన కంగ‌న‌

By:  Tupaki Desk   |   11 Jun 2023 5:00 PM GMT
తెల్ల తోలు ఎలుక అంటూ స్టార్ హీరోని తిట్టేసిన కంగ‌న‌
X
బాలీవుడ్ మాఫియాని.. న‌ట‌వార‌సుల్ని నిర్ధ్వంద్వంగా చెడుగుడు ఆడ‌టంలో కంగ‌న‌కు ఒక రికార్డు ఉంది. ఎప్ప‌టిక‌ప్పుడు వీలున్న ప్ర‌తి వేదిక‌పైనా ఆడుకుంటూనే ఉంది. ఈ వైఖ‌రిని కొంద‌రు నోటిదురుసు అని విమ‌ర్శించినా కానీ కంగ‌న త‌న బాణీని మార్చుకోదు. ఆలియాభ‌ట్-క‌ర‌ణ్ జోహార్ - భ‌న్సాలీ- చోప్రాలు- రోష‌న్ లు అంద‌రినీ కంగ‌న టార్గెట్ చేసింది. ఘాటైన ప‌ద‌జాలం విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డింది.

ఇప్పుడు ర‌ణ‌బీర్ వంతు. అత‌డి భార్య ఆలియాపై నిరంత‌రం విమ‌ర్శ‌లు చేసే కంగ‌న ఇప్పుడు ఏకంగా ర‌ణ‌బీర్ నే టార్గెట్ చేసింది. రణ్ బీర్ ని `సన్నగా ఉండే తెల్లని ఎలుక` అని సెటైర్ వేసింది. త‌దుప‌రి `రామాయణం`లో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చిన తర్వాత కంగనా రనౌత్ ఇలా విరుచుకుప‌డింది. నితేష్ తివారీ `రామాయణం`లో స్టార్ కపుల్ రణబీర్ కపూర్- ఆలియా జంట శ్రీ‌రాముడు- సీతా దేవిగా న‌టిస్తార‌ని ప్ర‌చారమైంది. ఇంత‌లోనే కంగ‌న ఈ కాస్టింగ్ సెలక్ష‌న్ పై విరుచుకుప‌డింది. ఇన్ స్టాగ్రామ్ లో ర‌ణ‌బీర్ ఎంపిక‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది.

ఇటీవల బొల్లి రామాయణం గురించిన మరొక వార్త వింటున్నాను... ఇందులో ఒక తెల్లటి ఎలుక (నటుడు అని పిలవబడేది) న‌టిస్తుంద‌ట‌. అతను దాదాపు ప్రతి ఒక్కరి గురించి అసహ్యకరమైన ప్ర‌చారం చేస్తూ అపఖ్యాతి పాలయ్యాడు. పరిశ్రమలో స్త్రీలింగత్వం .. మాదకద్రవ్యాల వ్యసనంతో పాపుల‌రైన త్రయం (ఎవరూ చూడని లేదా ఎక్కువ భాగాలను రూపొందించాలని కోరుకోని) చేసిన సినిమాలో తనని తాను శివుడిని నిరూపించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించిన తర్వాత ఇప్పుడు రాముడు కావాలనే అభిరుచి పెరిగింది.. అంటూ రణ‌బీర్ ని ప‌రోక్షంగా విమ‌ర్శించింది. బ్ర‌హ్మాస్త్ర‌లో ర‌ణ‌బీర్ శివ పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే.

రావణ్ పాత్రలో సౌత్ స్టార్ యష్ నటిస్తారని మీడియా కథనాలు కూడా ప్రచారం చేశాయి. స్వీయ నిర్మితుడైన ఒక యువ దక్షిణాది సూపర్ స్టార్ వాల్మీకి జీ వర్ణన ప్రకారం సంప్రదాయవాది. అంకితభావం కలిగిన కుటుంబ వ్యక్తి. అతను తన రంగు ప్రవర్తన ముఖ లక్షణాలలో శ్రీ‌రాముడిలా కనిపిస్తాడు. కానీ రావణుడిగా నటించడానికి ఆఫర్ చేసార‌ట‌. ఇది ఎలాంటి కలియుగం ?? లేతగా కనిపించే మందు సోయా కుర్రాడు రాముడి పాత్ర‌ను పోషించకూడదు .... జై శ్రీ రామ్``అని కంగ‌న వ్యాఖ్యానించింది. కంగనా ప్రమాదకరమైన gifని జోడించి ఇలా రాసింది ``నువ్వు ఒక్కసారి నన్ను కొడితే చచ్చేదాకా నిన్ను కొడతాను!!! నాతో గొడవ పెట్టుకోకు దూరంగా ఉండు!!!!`` అంటూ ర‌ణ‌బీర్ పై ఘాటైన పంచ్ విసిరింది. నటన పరంగా కంగనాకు వ‌రుస చిత్రాలున్నాయి. ఎమర్జెన్సీ -తేజస్-చంద్రముఖి 2-మణికర్ణిక రిటర్న్స్: ది లెజెండ్ ఆఫ్ దిద్దా- ది ఇన్కార్నేషన్: సీత వంటి అనేక చిత్రాలు క్యూలో ఉన్నాయి.