Begin typing your search above and press return to search.
అమ్మనైతే ఐటెం సాంగ్ చేయకూడదా?:కస్తూరి
By: Tupaki Desk | 3 Jun 2018 7:42 AM GMTపలు తెలుగు, తమిళ చిత్రాల్లో గ్లామర్ పాత్రలతో అలరించిన నిన్నటితరం కథానాయిక కస్తూరి సినీ ప్రేమికులకు సుపరిచితురాలే. తెలుగులో 'సోగ్గాడి పెళ్లాం` , 'మా ఆయన బంగారం`, `నిప్పు రవ్వ` వంటి చిత్రాలతో ఆమెకు గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత పెళ్లి కావడంతో నటనకు గ్యాప్ ఇచ్చిన కస్తూరి 2010లో 'తమిళ పదం' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తనకు తగ్గ పాత్రలను పోషిస్తోంది. తాజాగా, 'తమిళపదం'కి సీక్వెల్ గా రూపొందుతోన్న 'తమిళపదం 2.0' సినిమాలో కస్తూరి ఓ ఐటమ్ సాంగ్ లో అదరగొట్టింది. ఆ చిత్రం టీజర్లో కస్తూరి....కుర్ర హీరోయిన్లకు దీటుగా గ్లామర్ మెయింటెన్ చేయడంతో ఆమెపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నాలుగు పదుల వయసులో కూడా ఫిట్ నెస్ ను మెయింటెన్ చేస్తున్న కస్తూరిని చూసి కుర్రకారు ఫిదా అయిపోయింది. అయితే, ఈ వయసులో ఐటమ్ సాంగ్ లో నటించడం ఏమిటంటూ....ఓ నెటిజన్ ....కస్తూరిని కామెంట్ చేశాడు. దీంతో, ఆ నెటిజన్ కు కస్తూరి ఘాటుగా రిటార్ట్ ఇచ్చింది.
పిల్లల పట్ల బాధ్యతగా ఉంటూ తల్లి పాత్రలు చేయవలసిన వయసులో ఐటమ్ సాంగ్స్ ఏంటి అని ఓ అభిమాని కస్తూరిని ప్రశ్నించాడు. దానికి ఆమె ఘాటుగా సమాధానమిచ్చింది. పెళ్లైన మగవాళ్లు మందు కొట్టి చిందేసే సన్నివేశాలు, ఐటమ్ సాంగులు చేస్తున్నారని....వారికి పిల్లల పట్ల బాధ్యత ఉండాలి కదా అంటూ ప్రశ్నించింది. హీరోలను ఎవరూ ప్రశ్నించరని, అమ్మనైనంత మాత్రాన ఐటమ్ సాంగ్ చేయకూడదని రూల్ ఉందా అంటూ ఘాటుగా బదులిచ్చింది. ఒక నటిగా శృంగారాత్మకంగా కనిపించడం తప్పుకాదని, నటనలో పాత్రను చూడాలి తప్ప నటిని కాదని రిటార్ట్ ఇచ్చింది. ఆ ఐటెం సాంగ్ షూటింగ్ కు తన కొడుకు కూడా వచ్చాడని, తాను తప్పు చేయడం లేదు కాబట్టి కాన్ఫిడెంట్ గా చేశానని చెప్పింది. స్త్రీ పురుష సమానత్వంపై ఇపుడు చర్చ జరుగుతోందని, విచిత్రమైన రొడ్డకొట్టుడు తమిళ మనస్తత్వంతో మహిళలను పాతాళానికి తొక్కేయకండి.... అంటూ సమాధానమిచ్చింది. కస్తూరి కామెంట్స్ కు పలువురు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.