Begin typing your search above and press return to search.
రూ.132 కోట్ల నష్టాలు.. పలు సార్లు ఆత్మహత్య యత్నం
By: Tupaki Desk | 16 May 2023 7:00 AM GMTబుల్లి తెరతో పాటు వెండి తెరపై తనదైన ముద్ర వేసిన సీనియర్ నటి కవిత. రాజకీయాల్లో కూడా అప్పుడప్పుడు సందడి కవిత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన కీలక సంఘటనల గురించి వ్యాఖ్యలు చేసింది. తన భర్త రూ.132 కోట్లు వ్యాపారంలో నష్టపోయారు అంటూ చెప్పుకొచ్చారు.
ఎదురు చూడని విప్పత్తులు వచ్చి తన జీవితంను అతలాకుతలం చేశాయంటూ కవిత ఆవేద వ్యక్తం చేశారు. ఇంకా ఆమె మాట్లాడుతూ... బాల నటిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా సినిమాల్లో నటించి మంచి పేరు దక్కించుకున్నాయి. కానీ కొన్ని కారణాల వల్ల 20 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్నాను. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయ్యాను.
పెళ్లి అయిన తర్వాత అప్పటికే కమిట్ అయిన సినిమాలను పూర్తి చేశాను. పెళ్లి తర్వాత కూడా చాలా ఆఫర్లు వచ్చాయి కానీ నో చెప్పాను. కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత ఇండస్ట్రీలో సహాయ నటిగా కెరీర్ ను మళ్లీ మొదలు పెట్టాను. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించాను.
నా భర్త నన్ను మహారాణి గా చూసుకున్నారు. మాకు 11 దేశాల్లో ఆయిల్ బిజినెస్ లు ఉండేవి. ప్రతి విషయంలో కూడా నాకు ఆయన గౌరవాన్ని ఇచ్చారు. ఏడు సంవత్సరాల క్రితం వ్యాపారంలో నష్టం రావడంతో చాలా ఆస్తులు పోగొట్టుకున్నాం. రూ.132 కోట్ల ను పోగొట్టుకున్నాం.
కరోనా సమయంలో నా భర్త మరియు కుమారుడు మరణించారు. దాంతో నాకు చీకట్లు మిగిలాయి. బాబు చనిపోయిన కేవలం పది రోజుల గ్యాప్ లో నా భర్త కూడా చనిపోవడంతో జీవితం మొత్తం చీకట్లు అలుముకున్నాయి. దాంతో పలు సార్లు ఆత్మహత్య కు ప్రయత్నించాను.
కానీ నా కుమార్తెలను చూసి మళ్లీ ఆగిపోయేదాన్ని. ఆ బాధ నుండి బయట పడేందుకు గాను ఏదో పని చేస్తూ ఉండాలని భావిస్తున్నట్లుగా పేర్కొంది. మళ్లీ నటిగా బిజీ అవ్వాలని చూస్తున్నట్లుగా పేర్కొంది. ఎలాంటి పాత్రలు వచ్చినా చేసేందుకు సిద్ధం అన్నట్లుగా కవిత అన్నారు.