Begin typing your search above and press return to search.

కీర్తి అందాలు వర్ణించతరమా.. చూపు తిప్పుకోగలమా?

By:  Tupaki Desk   |   17 Jan 2023 3:30 AM GMT
కీర్తి అందాలు వర్ణించతరమా.. చూపు తిప్పుకోగలమా?
X
మలయాళ దర్శకుడు సురేష్ కుమార్ కి.. తమిళ మూలాలు ఉన్న నటి మేనకకు జన్మించిన కీర్తి సురేష్ అనూహ్యంగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. వాస్తవానికి ఆమె బాలనటిగా మలయాళంలో కొన్ని సినిమాలు చేసింది. ఆ తర్వాత తెలుగులో నరేష్ కుమారుడు విజయ్ కృష్ణ హీరోతో ఒక సినిమా చేసింది కానీ... అది విడుదల అవలేదు. ఆ తర్వాత ఆమె తెలుగులో చేసిన నేను శైలజ సినిమా మొట్టమొదటి సినిమాగా విడుదలైంది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమె మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది.

అదే ఏడాది తమిళంలో కూడా అనేక సినిమాలు చేసిన ఆమె... తెలుగులో నేను లోకల్ వంటి సినిమాతో మరో హిట్ అందుకుంది. ఆ తర్వాత అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ పడినా సరే.. మహానటి సినిమాతో ఆమె దశ పెరిగిపోయింది.

ఇక ఆ తరువాత ఆమె ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుందని అందరూ అనుకున్నారు కానీ... ఆమె ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ.. వెళ్లడంతో ఆమెకు పెద్దగా కాలం కలిసి రాలేదు. అయితే ఎట్టకేలకు సర్కారు వారి పాట అనే సినిమాతో మళ్ళీ హిట్ అందుకున్న ఆమె ఇప్పుడు తెలుగులో వరుసు సినిమాలు చేస్తోంది.

అయితే సర్కారు వారి పాట సినిమా ముందు వరకు కీర్తి అంటే పద్ధతి సంప్రదాయానికి పెట్టింది పేరు అన్నట్లు చాలా సంప్రదాయబద్ధంగా అందాల ఆరబోతుకు చాలా దూరంగా ఉండేది. ఎప్పుడైతే సర్కారు వారి పాట సినిమాలో ఆమె అందాల ఆరబోతకు రెడీ అయ్యిందో అప్పటినుంచి ఆమెను కూడా గ్లామర్ హీరోయిన్ గానే అందరూ చూడడం మొదలుపెట్టారు.


తాజాగా కీర్తి సురేష్ కి సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు ఇప్పటివి కాదు కానీ ఆమె అందాలు వర్ణించ గలమా అంటూ ఆమె అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. వాస్తవానికి గత ఏడాది జరిగిన గలాటా అవార్డ్స్ ఫంక్షన్ లో కీర్తి సురేష్ ఈ అవుట్ ఫిట్ లో మెరిసింది. సంప్రదాయబద్ధంగా కనిపిస్తూనే ఒకపక్క.. మరోపక్క నాభి అందాలు కనిపించేలా ఈ డ్రెస్ డిజైన్ చేశారు. ఇంకేముంది ఆమె తన అందంతో అందరిని తనువైపు తిప్పేసుకుంటుంది .మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఫోటో మీద ఒకసారి లుక్ వేయండి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.