Begin typing your search above and press return to search.

కీర్తి బ్రాండింగ్ ఇమేజ్ పెరుగుతోందిగా..

By:  Tupaki Desk   |   25 Aug 2021 9:31 AM GMT
కీర్తి బ్రాండింగ్ ఇమేజ్ పెరుగుతోందిగా..
X
`మ‌హాన‌టి` చిత్రంతో న‌టిగా త‌న స్థాయిని ఆవిష్క‌రించిన కీర్తి సురేష్ ఆ త‌ర్వాత వ‌రుస‌గా క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల్లో న‌టించినా అవేవీ స‌క్సెస్ కాలేదు. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ `స‌ర్కార్ వారి పాట` చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌హేష్ స‌ర‌స‌న తొలి ఆఫ‌ర్ అందుకుంది. ఇప్ప‌టికే ప‌వ‌న్ స‌ర‌స‌న అజ్ఞాతవాసి లాంటి ఫ్లాప్ చిత్రంలో న‌టించిన కీర్తి ఇంత‌కాలానికి మ‌ళ్లీ పాథ్ బ్రేకింగ్ స్టార్ స‌ర‌స‌న ఆఫ‌ర్ అందుకుని బ్లాక్ బ‌స్ట‌ర్ కోసం వేచి చూస్తోంది.

ఇక ఇదే ఉత్సాహంలో ఈ అమ్మ‌డి ఖాతాలో వ‌రుస‌గా బ్రాండ్లు ప‌డుతున్నాయి. తాజాగా భూమిత్ర పేరుతో త‌న సొంత స్కిన్ కేర్ బ్రాండ్ ని లాంచ్ చేసింది కీర్తి. త‌న విదేశీ భాగ‌స్వాముల‌తో క‌లిసి కీర్తి ఇలా ఎంట‌ర్ ప్రెన్యూర్ గా మారుతోంది. నిజానికి కీర్తి ఇంత‌కుముందే అమెరికాలో త‌న కజిన్స్ బంధువుల భాగ‌స్వామ్యంతో బిజినెస్ లో ప్ర‌వేశించాన‌ని వెల్ల‌డించింది. ఇప్పుడు దీపం ఉండ‌గానే అన్న చందంగా కీర్తి స్కిన్ కేర్ ఉత్ప‌త్తుల బ్రాండ్ ని ప్రారంభించింది. ఆ మేర‌కు భీష్మా టాక్స్ ఇన్ స్టా ఈ వివ‌రాల్ని వెల్ల‌డించింది.

ఇప్ప‌టికే స‌న్నీలియోన్ స్కిన్ కేర్ ఉత్ప‌త్తులు సౌంద‌ర్య సాధ‌నాల ఉత్ప‌త్తుల వ్యాపారంలో దూసుకుపోతోంది. అలాగే క‌త్రిన `కె` పేరుతో సౌంద‌ర్య ఉత్ప‌త్తుల వ్యాపారాల్ని నిర్వ‌హిస్తోంది. టాలీవుడ్ లో స‌మంత స్కూల్స్ కాస్ట్యూమ్స్ బిజినెస్ లు స‌హా ర‌క‌ర‌కాల వ్యాపారాల‌తో బిజీ అయిపోయింది. ర‌కుల్ ప్రీత్ జిమ్ ల నిర్వ‌హ‌ణ వ్యాపారంతో ఆర్జిస్తోంది. ఉపాస‌న‌ స‌హా ప‌లువురు పాపుల‌ర్ సెల‌బ్రిటీలు ఎంట‌ర్ ప్రెన్యూర్ లుగా వెలుగుతున్నారు. ఇప్పుడు అదే బాట‌లో కీర్తి సురేష్ కూడా ఆదాయ మార్గాల్ని అన్వేషిస్తోంది. కీర్తి వెట‌ర‌న్ న‌టి మేన‌క కుమార్తె అన్న సంగతి తెలిసిందే.

భోళా శంక‌రునికి చెల్లెమ్మ‌గా కీర్తి

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్ర‌తీక‌గా నిలిచే ర‌క్షాబంధ‌న్ రోజు భోళాశంక‌ర్ టైటిల్ ని ప్ర‌క‌టించ‌డ‌మే గాక‌.. చిరు-కీర్తి మ‌ధ్య అనుబంధాన్ని గుర్తు చేసేలా ఓ పోస్ట‌ర్ ని మెహ‌ర్ ర‌మేష్ టీమ్ ఆవిష్క‌రించారు. చెల్లెమ్మ‌లంద‌రి గుండెల్ని తాకేలా అద్భుత‌మైన ఫోటోగ్రాఫ్ తో భోళాశంక‌ర్ టీమ్ మెస్మ‌రైజ్ చేసింది. వేదాళం రీమేక్ `భోళా శంక‌ర్‌`లో చిరంజీవి సోద‌రిగా కీర్తి సురేష్ ఫైన‌ల్ అయ్యింద‌ని అధికారికంగా ప్ర‌క‌టించారు.

చెల్లెమ్మ కీర్తి అన్న‌య్య చిరంజీవి చేతికి రాఖీ క‌డుతూ చిరున‌వ్వులు చిందిస్తుంటే ఎంతో ఆప్యాయంగా ఆనందంగా చిరు ఆ చెల్లెమ్మ‌ను ప్రేమ‌గా ధీవించిన తీరు ఎంతో ముచ్చ‌ట‌గొలిపింది. చెల్లెల్లంద‌రి ర‌క్షాబంధం.. అభిమానులంద‌రి ఆత్మ‌బంధం.. మ‌నంద‌రి అన్న‌య్య జ‌న్మ‌దినం .. హ్యాపీ బ‌ర్త్ డే అన్న‌య్యా!! అంటూ మోష‌న్ టీజ‌ర్ తో కీర్తి సురేష్ అంద‌మైన స్వ‌రం ఆక‌ట్టుకుంది. మోష‌న్ పోస్ట‌ర్ రాఖీ మెగా స్పెష‌ల్ గా ఆక‌ట్టుకుంది. ఏకే ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై అనీల్ సుంక‌ర‌- రామ‌బ్ర‌హ్మం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.