Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: కియారా.. కిక్కెక్కించే స్టైల్

By:  Tupaki Desk   |   30 Dec 2018 9:43 AM GMT
ఫోటో స్టొరీ: కియారా.. కిక్కెక్కించే స్టైల్
X
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని ఇప్పుడు హిందీ.. తెలుగు సినిమాలతో పాటు వెబ్ సీరీసులలో కూడా నటిస్తూ బిజీ బిజీగా ఉంది. ఈ జెనరేషన్ బ్యూటీలందరిలాగానే కియారా కూడా ఒక ఫ్యాషన్ ఐకాన్. ఎప్పుడు బయటకు వచ్చినా స్టైలిష్ కాస్ట్యూమ్స్ తో అందరినీ ఆకట్టుకుంటుంది. అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తూ రీసెంట్ గా ముంబై ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చింది.

బ్లూ కలర్ టాప్.. పైన వైట్ ష్రగ్ కిందేమో లూజ్ గా ఉండే వైట్ కలర్ త్రీ ఫోర్త్ ప్యాంట్ వేసుకొని స్టైల్ గా నడుచుకుంటూ వచ్చింది. పెద్దగా మేకప్ వేసుకోలేదు.. సింపుల్ గా లిప్ స్టిక్ వేసుకుంది.. అంతే. భుజానికి ఒక సిల్వర్ కలర్ లో ఉండే బ్యాగ్ ను తగిలించుకుంది. ఒక చేతిని ప్యాంట్ జేబులో పెట్టుకొని మరో చేత్తో ఫోన్ ను పట్టుకుంది. ఓవరాల్ గా చూస్తే కంఫర్ట్ తో పాటు స్టైల్ ను మిక్స్ చేసినట్టుగా ఉంది.

కియారా అద్వాని రాబోయే సినిమాల విషయానికి వస్తే రామ్ చరణ్ 'వినయ విధేయ రామ' లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా జనవరి 10 న విడుదల కానుంది. ఈ సినిమా కాకుండా 'అర్జున్ రెడ్డి' హిందీ రీమేక్ లో కూడా నటిస్తోంది.