Begin typing your search above and press return to search.

వీడియో: ఆపకుంటే ఫ్యాషన్ డిజాస్టరే

By:  Tupaki Desk   |   30 May 2019 10:55 AM GMT
వీడియో: ఆపకుంటే ఫ్యాషన్ డిజాస్టరే
X
బాలీవుడ్ లో ఉన్న క్రేజీ భామలలిస్టులో ప్రస్తుతం టాప్ ప్లేస్ లో ఉండే భామ కియారా అద్వాని. అందం.. నటన.. స్టైల్.. బోల్డ్ నెస్.. క్రేజ్ అన్నీ కలిస్తే కియారా అవుతుంది. మిగతా హీరోయిన్లను ఎవరినైనా తీసుకోండి.. ఏదో ఒక ఎలిమెంట్ మిస్ అవుతుంది. కానీ కియారా అలా కాదు. కియారా చాలా చాలా మోడరన్. అందుకే ఎప్పడు బైటకు వచ్చినా అల్ట్రా స్టైలిష్ డ్రెస్సుల్లో అందరినీ క్లీన్ బౌల్డ్ చేస్తుంది.

రీసెంట్ గా కియారా తన ట్రెండ్ ను కొనసాగిస్తూ ఒక డ్రెస్ వేసుకుంది. ఈ డ్రెస్ లో ప్రత్యేకత ఏంటంటే.. ఇదో షర్టు.. షర్ట్ లాంటి గౌన్. ముందేమో మోకాళ్ళ పైకి ఉంది.. వెనక మరి కొంచం పొడవుగా ఉంది. పైనేమో కాలర్.. ఫుల్ స్లీవ్స్ ఉన్నాయి. ఈ లైట్ బ్లూ కలర్ డ్రెస్ లో కియారా వయ్యారంగా నడుస్తూ మీడియావారికి హాయ్ చెప్తూ మెట్లెక్కింది. స్టైల్ గా ఒక ఒకవైపుగా తిరుగుతూ మళ్ళీ హాయ్ చెప్పింది. కానీ సరిగ్గా ఇదే సమయంలో అదేదో పాత తెలుగు పాటలాగా కోకెత్తుకెళ్ళింది కొండగాలి అన్నట్టుగా గాలి వీచింది. కియారా షర్టు పైకి లేవబోయింది. కానీ ఎంతో అప్రమత్తంగా ఉన్న కియారా రెండు చేతులతో పైకి లేచే గౌన్ ను కిందకు లాగి తన గౌరవాన్ని కాపాడుకుంది.

పొరపాటున ఆ డ్రెస్ లేచి ఉంటే ఈ పాటికి "కియారాస్ ఊప్స్ మూమెంట్".. "కియారాస్ ఫ్యాషన్ డిజాస్టర్".. "ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది" ఇలాంటి టైటిల్స్ లో వెబ్ సైట్స్ లో ఆర్టికల్స్ రాసి దుమ్ము లేపి ఉండేవారు. అయినా అలాంటి వయ్యారమైన డ్రెస్ వేసుకోవడం ఎందుకు. పూణే.. ముంబై హైవే లో ఉన్న లోనావలా కొండల మీదుగా వచ్చి ముంబైలో ల్యాండ్ అయిన అల్లరి గాలి బారిన పడడం ఎందుకు.?