Begin typing your search above and press return to search.

ఖ‌డ్గం ఫేం కిమ్ శ‌ర్మ రూపం ఇలా మారిపోయిందే

By:  Tupaki Desk   |   26 Feb 2023 7:00 AM GMT
ఖ‌డ్గం ఫేం కిమ్ శ‌ర్మ రూపం ఇలా మారిపోయిందే
X
వ‌య‌సుతో ప‌నేం ఉంది మ‌న‌సుండాలే కానీ.. ఇది మ‌లైకా.. కిమ్ శ‌ర్మ లాంటి భామ‌ల‌కు యాప్ట్. మ‌లైకా త‌న‌కంటే వ‌య‌సులో చిన్న‌వాడైన అర్జున్ క‌పూర్ తో ప్రేమాయ‌ణంలో ఉంది. ఇక `ఖ‌డ్గం` ఫేం కిమ్ శర్మ వ‌య‌సు 45కి చేరువ‌వుతోంది. అయినా ఈ బ్యూటీ ఎఫైర్స్ ప‌రంగా త‌గ్గేదేలే అంటూ చెల‌రేగుతున్న తీరు నిరంత‌రం చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. కిమ్ శర్మ నిరంత‌ర ప్రేమాయ‌య‌ణాలు ఎప్పుడూ హాట్ టాపిక్.

టెన్నిస్ దిగ్గ‌జం లియాండ‌ర్ పేస్ తో రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. ఈ జంట తరచుగా విందు వినోదాలు.. విహార యాత్ర‌ల‌తో ఎంజాయ్ చేస్తూ లైవ్ ఫోటోల‌ను వీడియోల‌ను షేర్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఒకరికొకరు ప్రేమలో త‌న్మ‌యాన్ని ఏనాడూ ర‌హ‌స్యంగా దాచుకోలేదు. ఈ జంట వివాహం గురించి ఇంత‌కుముందు చ‌ర్చ సాగింది.

కిమ్ తరచుగా లియాండర్ తో రొమాంటిక్ గా ఉన్న ఫోటోల‌ను షేర్ చేస్తోంది. తమ కుటుంబ సభ్యులతో 2021 డిసెంబ‌ర్ చివ‌రిలో క్రిస్మస్ వేడుకల్లోనూ ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. రెండేళ్లుగా కిమ్ అత‌డితో ప్రేమ‌లో ఉంది. లియాండ‌ర్ ఫేస్ కంటే ముందు కిమ్ న‌లుగురితో ప్రేమాయ‌ణాలు సాగించిన సంగ‌తి త‌లిసిందే. లియాండ‌ర్ ని మూడో పెళ్లి చేసుకునేందుకు సిద్ధ‌మైంద‌ని క‌థ‌నాలొచ్చాయి.

కిమ్ సామాజిక మాధ్య‌మాల్లో ఎంత స్పీడ్ గా ఉంటుందో తెలిసిందే. ఇటీవ‌ల ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోగ్రాఫ్స్ ని గ‌మ‌నిస్తే ఇప్పుడిప్పుడే వ‌య‌సు మ‌ళ్లుతోందా? అన్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు. మ‌లైకా త‌ర్వాత మ‌ళ్లీ వ‌య‌సును బ‌య‌ట‌కు తెలియ‌నివ్వ‌కుండా మ్యానేజ్ చేస్తున్న భామ‌గా కుర్ర‌కారు గుట్టు క‌నిపెట్టేసింది. తాజాగా ఓ ఫోటోగ్రాఫ్ లో కాస్త వృద్ధురాలిగా క‌నిపించిన ఫోటో ఇప్పుడు వైర‌ల్ గా మారుతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.