Begin typing your search above and press return to search.

అన్న‌గారులాగే ఆ సీనియ‌ర్ న‌టి!

By:  Tupaki Desk   |   6 March 2023 3:00 PM GMT
అన్న‌గారులాగే ఆ సీనియ‌ర్ న‌టి!
X
న‌ట సార్వ‌భౌముడు..అన్న‌గారు ఎన్టీఆర్ ఎంత గొప్ప నాన్ వెజ్ ప్రియుడో చెప్పాల్సిన ప‌నిలేదు. ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వ‌ర‌కూ మాంమాసాహారం త‌ప్ప‌నిస‌రి. చిల్లి గారి-చికెన్ కాంబినేష‌న్ ఎంతో మంది అప్ప‌టి స్టార్ల‌కు రుచి చూపించింది ఆయ‌నే. అందుకే ఎన్టీఆర్ గురించి ఆయ‌న స‌హ‌చ‌రులు ఎవ‌రు చెప్పినా? గొప్ప నాన్ వెజ్ ప్రియుడిగా చెబుతుంటారు. అయితే భ‌క్తి నేప‌థ్యంగ‌ల సినిమాలు చేస్తే మాత్రం మాంంసం వాస‌న కూడా ద‌గ్గ‌రకు రానివ్వ‌రుట‌.

అలాంటి సినిమాలో న‌టిస్తున్న‌ప్పుడు నాన్ వెజ్ వంట‌కాల‌కు దూరంగా ఉంటారుట‌. ఈ విష‌యంలో అన్న‌గారిని చూసి ఎంతో నేర్చుకున్నాన‌ని అల‌నాటి న‌టి కె.ఆర్ విజ‌య తెలిపారు. ఆయ‌న దేవుడు పాత్ర‌లు చేసేట‌ప్పుడు ఎంతో నియ‌మ నిష్ట‌ల‌తో ఉంటారు. సెట్ లో ఆయ‌న్ని అలా చూసి నేను ఎంతో నేర్చుకున్నాను. షూటింగుకు ముందు అమ్మవారి గుడికి వెళ్లి ఆ తల్లి ఆశీస్సులు తీసుకునేదానిని.

ఆ షూటింగు పూర్తయ్యేవరకూ శాకాహారిగా ఉండేదాన్ని. నేను ఎక్కడికి వెళ్లినా అమ్మవారిగా భావించి నన్ను గౌరవిస్తూ ఉండేవారు' అని అన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ..నటన అంటే మా నాన్నగారికి ఎంతో ఇష్టం.

అందువలన చిన్నప్పటి నుంచి నాతో నాటకాలు .. డ్రామాలు వేయిస్తూ ఉండేవారు. అందువ‌ల‌నే 3వ తరగతికి మించి చదువు సాగలేదు. చ‌దువుకున్న క‌ళారంగం వైపు అప్ప‌టి నుంచి మ‌రింత ఆస‌క్తి చూపించేదాన్ని.

అలా మొద‌లైన ప్ర‌యాణం ఎన్నో సినిమాల వ‌ర‌కూ కొన‌సాగింది. న‌టి అవ్వ‌డం అన్న‌ది నిజంగా ఎంతో గొప్ప విష‌యం. న‌టుల‌కు మాత్ర‌మే ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంటుంది. వివాహమైన తరువాత కూడా నటించమని మా వారే నన్ను ప్రోత్సహించారు. అందువల్లనే నేను ఇన్ని సినిమాలు చేయగలిగాను. మా అమ్మాయి మా బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ ఉంటుంది .

అల్లుడు 'అపోలో'లో డాక్టర్. అప్పట్లో నాతో పాటు నటించిన శారద .. కాంచన .. రాజశ్రీ .. షావుకారు జానకి అంతా ఇప్ప‌టికీ ట‌చ్ లో ఉంటాం. ఫోన్ల ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు మాట్లాడుకుంటాం' అని అన్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.