Begin typing your search above and press return to search.
కృతి శెట్టి డాన్స్ చూస్తే మతిపోవడం ఖాయం!
By: Tupaki Desk | 10 July 2022 4:09 PM GMTటాలీవుడ్ లోని కేరక్టర్ ఆర్టిస్టులలో బ్రహ్మాజీ స్థానం ప్రత్యేకం. ఎంతో సీనియారిటీ ఉన్నప్పటికీ, ఈ జనరేషన్ స్టార్స్ తో కలిసి పోయి ఆయన నటిస్తుంటారు. ఇప్పటికీ ఆయన చాలా యాక్టివ్ గా ఉండటం చూసి, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో తోటి ఆర్టిస్టులు ఆటపట్టిస్తుంటారు కూడా. ఆ కామెంట్స్ ను సరదాగా తీసుకుంటూ ఆయన ముందుకు వెళుతుంటారు. 'ది వారియర్' సినిమాలో ఆయన కీలకమైన పాత్రను పోషించాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడారు.
"లింగుసామి గారి 'రన్' సినిమా చూసిన తరువాత నేను ఆయన అభిమానిగా మారిపోయాను. లింగుసామి గారు రామ్ తో సినిమా చేస్తున్నాడని తెలిసి నేను ఆయన ఆఫీసుకి వెళ్లి కలిశాను. ఆయన నన్ను చాలా మర్యాద పూర్వకంగా రిసీవ్ చేసుకున్నారు. ఆయనకి థ్యాంక్స్ చెప్పడం కోసమే ఈ ఈవెంట్ కి వచ్చాను. ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది. ఆయన సినిమాల్లో నటించడం చాలా ఈజీ. ప్రతి సీన్ ను బాడీ లాంగ్వేజ్ తో చూపిస్తారు.
ఆయనతో మరో సినిమా చేయవలసి వస్తే .. డబ్బులు లేకుండా చేస్తాను. ఆయన నాకు బాగా నచ్చిన డైరెక్టర్. తెలుగులో హరీశ్ శంకర్ కీ లింగుసామికి మధ్య చాలా దగ్గర లక్షణాలు కనిపిస్తాయి. ఆ వాడీ .. వేడీ .. వగరు .. పొగరు ఇద్దరిలోను కనిపిస్తాయి. ఇక రామ్ విషయానికి వస్తే ఆయన పెర్ఫార్మెన్స్ చూసి పెద్ద ఫ్యాన్ అయ్యాను. తెలుగులో కంటే బాగా తమిళంలో ఆయన డైలాగులు చెప్పడం చూసి నేను ఆశ్చర్యపోయాను.
తమిళంలో కూడా ఆయన సింగిల్ టేక్ లో చేయడం చూసి షాక్ అయ్యాను. బాలీవుడ్ లో ఉండవలసిన రామ్ .. టాలీవుడ్ లో ఉండటం మన అదృష్టం. ఈ సినిమాలో కృతి బేబమ్మలా ఉండదు. ఆమె డాన్సులు చూసి నాకు మతిపోయింది. బేబమ్మేనా ఇంతలా చేసింది అనుకున్నాను. ఈ సినిమాతో తను సౌత్ ఇండియాలోనే బెస్ట్ హీరోయిన్ అవుతుంది. ఈ నెల 14వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమాను తప్పకుండా చూడండి" అంటూ చెప్పుకొచ్చాడు.