Begin typing your search above and press return to search.

అందంతో తీన్మార్ ఆడించేస్తుంది..!

By:  Tupaki Desk   |   19 Nov 2022 2:30 AM GMT
అందంతో తీన్మార్ ఆడించేస్తుంది..!
X
రంగుల ప్రపంచంలో కొందరికి వరుసగా అవకాశాలు వచ్చేస్తుంటాయి. కానీ కొందరికి మాత్రం ఏం చేసినా సరే అవకాశాలు రావు వచ్చిన అవకాశాలు కూడా ఫెయిల్ అవుతుంటాయి. అలాంటి బ్యాడ్ లక్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ లో మొదటి ప్లేస్ లో ఉంటుంది కృతి కర్బందా.. తెలుగులో బోణీ సినిమాతో తెరంగేట్రం చేసిన అమ్మడికి ఫస్ట్ సినిమా నుంచి బ్యాడ్ లక్ వెంటాడింది. పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తో తీన్మార్ సినిమాలో నటించినా సరే అమ్మడి ఫేట్ మారలేదు.

రామ్ తో ఒంగోలు గిత్త, కళ్యాణ్ రామ్ తో ఓమ్ లో నటించిన కృతి చివరగా చరణ్ సినిమాలో సిస్టర్ రోల్ చేసినా సరే అది నిరాశపరచింది. అందుకే టాలీవుడ్ లో ఆమెది ఐరన్ లెగ్ అన్న ముద్ర పడ్డది.

ఇక బాలీవుడ్ లో కూడా ఆశించిన స్థాయిలో అవకాశాలు రాబట్టుకోలేని కృతి వచ్చిన ఛాన్సులను వదలకుండా చేసింది. అయితే హిందీలో కూడా కృతికి పెద్దగా క్రేజ్ దక్కలేదు. అరకొర అవకాశాలతోనే ఇన్నాళ్లు కెరీర్ వెళ్లదీస్తూ వచ్చింది.

సినిమాల్లో పెద్దగా మెప్పించకపోయినా గ్లామర్ షోతో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయాలని చూస్తుంది కృతి.. అమ్మడి హాట్ షోకి తన సోషల్ మీడియా ఫాలోవర్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఇన్ స్టాగ్రాం లో 8 మిలియన్ ఫాలోవర్స్ తో సత్తా చాటుతున్న కృతి ఆ ఫాలోవర్స్ కోసం ఈమధ్య తన అందాల ప్రదర్శన చేస్తుంది. లేటెస్ట్ గా కృతి శారీ లుక్ తో సర్ ప్రైజ్ చేసింది. కట్టింది శారీనే కానీ బ్రా టైప్ జాకెట్ తో పరువాలను చూపిస్తూ పిచ్చెక్కించేస్తుంది కృతి.

కెరీర్ మొదటి నుంచి గ్లామర్ షో విషయంలో కొద్దిగా మొహమాట పడిన అమ్మడు ఇక మీదట నో లిమిట్స్ అనేలా రెచ్చిపోతుంది. కృతి లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఈ రేంజ్ గ్లామర్ షో చేస్తుందంటే ఇక మీదట ఎలాంటి సినిమాలకైనా రెడీ అన్నట్టు హింట్ ఇచ్చినట్టే. ఇప్పటికి కూడా కృతి తెలుగులో సినిమా చేస్తే బాగుంటుందని అనుకునే ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఆ ఛాన్స్ ఎవరు ఇస్తారన్నది తెలియాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.