Begin typing your search above and press return to search.

గ‌ర్భ స్రావ‌మైనా న‌టికి ప‌శ్చాత్తాపం లేద‌ట‌!

By:  Tupaki Desk   |   2 July 2022 4:15 AM GMT
గ‌ర్భ స్రావ‌మైనా న‌టికి ప‌శ్చాత్తాపం లేద‌ట‌!
X
త‌న‌ని కుటుంబ స్నేహితుడు వేధించాడు. గ‌ర్భ‌వ‌తి అయ్యాన‌ని తెలుసుకుంది. కానీ తాను ఆ భారాన్ని మోయ‌లేను అనుకుంది.. అబార్ష‌న్ చేయించుకుంది. అలా చేసినందుకు త‌న‌లో ఎలాంటి ప‌శ్చాత్తాపం లేద‌ని తెలిపింది. ఇంత‌కీ ఎవ‌రా న‌టి? అంటే బాలీవుడ్ లో బిజీ ఆర్టిస్ట్.. స‌హాయ న‌టి కుబ్రా సైథ్. సేక్రేడ్ గేమ్స్ సిరీస్ తో కుబ్రా సైథ్ యువ‌త‌రానికి సుప‌రిచితురాలు.

'ఓపెన్ బుక్: నాట్ క్వైట్ ఎ మెమోయిర్' అనే పేరుతో న‌టి కుబ్రా సైథ్ త‌న‌ జీవితంపై ఒక పుస్తకాన్ని విడుదల చేసింది. సేక్రేడ్ గేమ్స్ స్టార్ కుబ్రా తన జీవితంలోని ర‌క‌ర‌కాల అనుభవాల గురించి ఓపెనైంది. అందులో తన బెంగళూరు జీవితం.. కుటుంబ స్నేహితుడిచే వేధింపులకు గురికావడం స‌హా మరెన్నో విష‌యాలు రీడ‌ర్స్ ని హీటెక్కించ‌నున్నాయి. పుస్త‌కంలోని ఒక అధ్యాయంలో కుబ్రా ఒక దిగ్భ్రాంతికర సంఘ‌ట‌న‌ను వ‌ర్ణించింది.

కుబ్రా సైత్ 'వ‌న్ నైట్ స్టాండ్' చిత్రంలో న‌టించిన‌ తర్వాత 30 సంవత్సరాల వయస్సులో గర్భవతి అయ్యాన‌ని వెల్లడించింది. అంతేకాదు తాను గర్భస్రావం చేయించుకోవాలని నిర్ణయించుకుందిట‌. 'ఐ వాజ్ నాట్ రెడీ టు బి ఎ మదర్' అనే అధ్యాయంలో కుబ్రా ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది.

అండమాన్ లో ఒక ట్రిప్‌లో సన్నిహిత స్నేహితుడితో ఒక రాత్రి గడిపిన తర్వాత తాను గర్భవతి అయ్యానని వెల్లడించింది. అత‌డి నుంచి వేధింపులు ఎదుర‌య్యాయ‌ని కూడా తెలిపింది. అయితే కుబ్రా తాను తల్లిగా ఉండటానికి సిద్ధంగా లేనందున గర్భాన్ని తొల‌గించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది.

ఒక‌ వారం గ‌డిచాక .. గర్భధారణ పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత.. నేను గర్భాన్ని తొల‌గించాలని నిర్ణయించుకున్నాను. నేను మామ్ కావ‌డానికి సిద్ధంగా లేను. ఇది నా జీవితాన్ని లేదా నా ప్రయాణాన్ని నేను ఊహించిన విధంగా ముందుకు వెళ్ల‌నివ్వ‌దని భావించిన‌ట్టు స‌ద‌రు న‌టి పుస్తకంలో పేర్కొంది. అంతేకాదు తాను అలా ఆలోచించ‌డం గురించి మాట్లాడుతూ...వెనుక్కి తిరిగి చూసుకుంటే తనకు ఎలాంటి 'పశ్చాత్తాపం' లేదని వెల్లడించింది.

23 ఏళ్లకే పెళ్లి చేసుకోవాలని.. 30 ఏళ్లు వచ్చేసరికి పిల్లల్ని కనాలని మహిళల చుట్టూ ఉన్న ఈ ఒత్తిడి నాకు అర్థం కావడం లేదు. అందుకే ఆ స‌మ‌యంలో పిల్ల‌ల‌ను క‌నాల‌ని అనుకోలేదు! అని కూడా తెలిపింది. అలా ఆలోచించినందుకు త‌న‌కు ప‌శ్చాత్తాపం లేద‌ని కూడా అంది. ''కానీ నేను భయంకరమైన మనిషిగా మారాను. ఆ ఎంపిక కారణంగా... కానీ ఆ బాధను నేను ఎలా భ‌రించాలో తెలీదు.. ఇతరులు దానిని ఎలా గ్రహిస్తారు? నా ఎంపికలు నా గురించి.. నాకు సంబంధించిన‌వి. కొన్నిసార్లు మీకు సహాయం చేయడం కష్టంగా ఉంటుంది. కానీ క‌ష్టంలో సాయ‌ప‌డండి!'' అని కూడా పుస్త‌కంలో రాసుకుంది కుబ్రా.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. కుబ్రా చివరిగా 'డాలీ కిట్టి ఔర్ వో చమక్తే సితారే'లో కనిపించింది. RK/RKay చిత్రంలోనూ న‌టిస్తోంది. త్వ‌ర‌లోనే ఈ మూవీ విడుద‌ల కావాల్సి ఉంది. ట్రైల‌ర్ ఇప్ప‌టికే విడుద‌లై ఆక‌ట్టుకుంది.