Begin typing your search above and press return to search.

ఎగిరే పావురం మ‌ళ్లొస్తోంది!

By:  Tupaki Desk   |   29 Oct 2018 6:24 AM GMT
ఎగిరే పావురం మ‌ళ్లొస్తోంది!
X
లైలా లైలా ఆగలేను అన్నాడే.. ఇంకా చెలియా ఏది ఏది చేసాడే...
కలలో వచ్చి కౌగిలించు కున్నాడే .. ఆ పై చిలకా ఏమి చేసి పోయాడే..
చిరు నవ్వులు నవ్వాడే.. నడుముని తడిమేసాడే..
కితకితలెడుతున్నాయన్నా వినుకోడే.. లవ్ యు అంటూ గిల్లేసాడే. యాడ గిల్లాడే ...!

`నువ్వేకావాలి` చిత్రంలో లైలా స్పెష‌ల్ సాంగ్ అప్పియ‌రెన్స్ అంత తేలిగ్గా యూత్ మ‌ర్చిపోలేరు. కెరీర్‌ లో టాప్ హీరోయిన్‌ గా యువ‌త‌రం గుండెల్లో నిలిచిన లైలా.. ఎగిరే పావురమా - ఉగాది - పెళ్లి చేసుకుందాం - ఖైదీగారు - పవిత్రప్రేమ - శివ పుత్రుడు .. ఇలా ఎన్నో చిత్రాల్లో న‌టించి మెప్పించారు. ఎగిరే పావుర‌మా చిత్రంలో ఇద్ద‌రు ప్రేమికుల మ‌ధ్య న‌లిగే అమ్మాయిగా న‌టించిన తీరు.. శివ‌పుత్రుడు చిత్రంలో అల్ల‌రి స్కూల్ గాళ్ పాత్ర‌లో అభిన‌యం మ‌ర్చిపోలేరు.

2006లో బిజినెస్‌ మేన్‌ మెహ్‌ దిన్‌ ని వివాహం చేసుకొని సినిమాలకు దూర‌మ‌య్యారు. దాదాపు 12ఏళ్ల త‌ర్వాత ఇప్పుడు తిరిగి లైలా రీఎంట్రీ ఇచ్చేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నార‌ని తెలుస్తోంది. న‌దియా - ఇంద్ర‌జ‌ - భూమిక త‌ర‌హాలోనే లైలా పున‌రారంగేట్రంలో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు కావాల‌నుకుంటున్నార‌ట‌. మునుముందు ద‌ర్శ‌క‌త్వం వ‌హించే ఆలోచన ఉంద‌ని ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. ``సౌత్‌ లో మ‌ళ్లీ ఛాన్సులొస్తున్నాయి. మంచి పాత్ర‌లు వ‌స్తే న‌టిస్తాను. నెగెటివ్ షేడ్ ఉన్న‌వి అయితే ఇంకా స‌ర‌దాగా ఉంటుంది`` అంటూ లైలా వ్యాఖ్యానించారు. త్రివిక్ర‌మ్‌ - కొర‌టాల‌ - బోయ‌పాటి .. స్టార్ డైరెక్ట‌ర్ల‌లో ఎవ‌రు ముందుగా లైలాను సంప్ర‌దిస్తారో?