Begin typing your search above and press return to search.
సునిశిత్ అనే వ్యక్తి పై లావణ్య త్రిపాఠి పిర్యాదు
By: Tupaki Desk | 17 March 2020 12:15 PM GMTగత కొన్ని రోజులుగా సునిశిత్ అనే వ్యక్తి టాలీవుడ్ లోని పలువురు నటీనటులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. పలు యూట్యూబ్ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తన నుండి కొందరు స్టార్లు పెద్ద సినిమాలు లాక్కుని తనను మోసం చేశారని - ఆ సినిమాలతో వాళ్ళు స్టార్లు అయిపోయారని మొదట్లో చెప్పుకొచ్చాడు. దీంతో ఇతనిని నెటిజన్లు 'సాక్రి ఫైజ్ స్టార్' అని సంబోధిస్తున్నారు. ఆ తరువాత తనకు ప్రముఖ హీరోయిన్లు తమన్నా - లావణ్య త్రిపాఠిలతో అఫ్ఫైర్లు ఉన్నాయని చెప్పుకొచ్చాడు.
అంతేకాకుండా హీరోయిన్ లావణ్య త్రిపాఠిని 2015లో పెళ్లి చేసుకున్నానని - తమది సీక్రెట్ లవ్ మ్యారేజ్ అని చెప్పుకొచ్చాడు. తనకు - లావణ్యకు గొడవ జరిగిందని - అందుకే ఇద్దరు కలిసున్న ఫోటోలు డిలీట్ చేశానని పేర్కొన్నాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హీరోయిన్ లావణ్య త్రిపాఠి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వ్యక్తిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మెయిల్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. సునిశిత్ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకున్నాడని అసత్య ప్రచారం చేస్తున్నారని లావణ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. లావణ్య త్రిపాఠి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సునిశిత్ కోసం గాలింపు చేపట్టారు. సునిశిత్ ను ఇంటర్వ్యూ చేసినందుకు పలు యూట్యూబ్ ఛానల్స్ పై కూడా కేసులు నమోదు చేసిన పోలీసులు వారిని విచారిస్తున్నారు.