Begin typing your search above and press return to search.
హీరోయిన్ గా మాలశ్రీ వారసురాలు!
By: Tupaki Desk | 8 Aug 2022 6:41 AM GMTఅలనాటి హీరోయిన్ మాలశ్రీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితే. మాలశ్రీ హీరోయిన్ గా..ఉమెన్ సెంట్రిక్ పాత్రల్లో చాలా సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. అన్ని రకాల పాత్రలతోనూ మాలశ్రీ తెలుగు పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు. ముఖ్యంగా పోలీస్ పాత్రలకు పెట్టింది పేరుగా మాలశ్రీ కొన్నాళ్ల పాటు కొనసాగారు.
ఇప్పుడామె కుమార్తె రాధనా రామ్ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. తరుణ్ సుధీర్ దర్శకత్వంలో దర్శన్ హీరోగా ఇటీవలే బెంగుళూరులో 'డి-56' టైటిల్ తో ఓ సినిమా ప్రారంభమైంది. ఇందులో హీరోయిన్ గా రాధనా రామ్ నటిస్తోంది. ఈ చిత్రానికి రాక్ లైన్ వెంటకేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుమార్తె ఎంట్రీపై మాలశ్రీ సంతోషం వ్యక్తం చేసారు.
రాధనాకి ముంబైలో ప్రత్యేకంగా డాన్స్..యాక్టింగ్ పై క్లాస్ లు చెప్పించినట్లు రివీల్ చేసారు. చిన్న నాటి నుంచి సినిమాలపై ప్రభావం కుమార్తెపై ఎక్కువగానే ఉందన్నారు. తన భర్త రాము కన్నడ ఇండస్ర్టీలో నిర్మాత కావడం సహా పలు కారణాలు రాధనాని సినిమా వైపు ప్రేరేపించినట్లు తెలిపారు. మరి రాధన సక్సెస్ రేట్ ఎలా ఉంటుందన్నది చూడాలి.
అయితే ఇండస్ర్టీలో సక్సెస్ ఫుల్ గా హీరోల వారసత్వం కొనసాగినంతగతా హీరోయిన్ల వారసత్వాలు కొనసాగలేదు. నాలుగైదు సినిమాలు చేసి వేర్వేరు వృత్తుల్లో స్థిరపడుతున్న వారు జాబితానే ఎక్కువగా ఉంది. రాధ కుమార్తులు కార్తిక..తులసీ ఇద్దరు హీరోయిన్లగా ఎంట్రీ ఇచ్చారు. కానీ సక్సెస్ అవ్వలేదు. అడపా దడపా సినిమాలు చేస్తున్నారు తప్ప హీరోయిన్లగా బిజీ కాలేకపోతున్నారు.
అలాగే జీవితారాశేఖర్ కుమార్తెలు శివానీ-శివాత్మిక కూడా ఇటీవల లాంచ్ అయ్యారు. ప్రస్తుతం సరైన బ్యానర్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే మలయాళ నటి లిజి కుమార్తెగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణి ప్రియ దర్శని 'హలో' సినిమాతో టాలీవుడ్ లో లాంచ్ అయింది. ఆ తర్వాత రెండు సినిమాలు చేసి సొంత పరిశ్రమకే పరిమితమైంది.
ఇక మలయాళ నటి మేకన కుమార్తెగా ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ మాత్రం బిజీ నటి అయింది. తెలుగు..తమిళ భాషల్లో సినిమాలు చేస్తుంది. అలాగే వెటరన్ నటి మంజుల కుమార్తులుగా వనిత..ప్రీత..శ్రీదేవి కొన్నేళ్ల క్రితమే ఎంట్రీ ఇచ్చారు. కానీ ఇండస్ర్టీలో నిలదొక్కుకోలేఎపోయారు. అలాగే కమల్ కుమార్తెగా అక్షరహాసన్.. అర్జున్ డాటర్ గా ఐశ్వర్య ఎంట్రీ ఇచ్చినా హీరోయిన్లుగా ఇంకా బిజీ కాలేదు.
ఇక అతిలోక సుందరి శ్రీదేవి తనయగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ మాత్రం బాలీవుడ్ లో దూసుకుపోతుంది. అమ్మడు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇంకా పలువురు నటీమణుల కుమార్తులు ఇండస్ర్టీలో రాణిస్తున్నారు.