Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : సముద్రపు ఒడ్డున మంటలు రేపుతున్న అందం..!

By:  Tupaki Desk   |   27 Oct 2022 2:30 PM GMT
ఫోటో స్టోరీ : సముద్రపు ఒడ్డున మంటలు రేపుతున్న అందం..!
X
ప్రకృతిలోని కొన్ని అందాలు ఎప్పటికీ ఆకర్షించబడతాయి. అలానే కొంతమంది హీరోయిన్స్ ఏజ్ బార్ అవుతున్నా సరే ఇప్పటికీ అంతే అందంగా ఆకర్షించబడతారు. ప్రేక్షకులను తన మత్తులో దించడమే కొంతమంది భామలు ప్రయత్నిస్తుంటారు.

అలాంటి వారిలో బాలీవుడ్ హాట్ బ్యూటీ మల్లికా షెరావత్ ఒకరు. అప్పట్లో ఆమె చేసిన క్వాహిష్, మర్డర్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి. అప్పట్లో అమ్మడి అందానికి హిందీ ఆడియన్స్ దాసోహం అయ్యారు. బాలీవుడ్ లో 2004-05 ఆ టైం లో మల్లికా షెరావత్ కి గోల్డెన్ టైం అని చెప్పొచ్చు. ఆ క్రేజ్ తోనే ఆమె హాలీవుడ్ ఆఫర్లు కూడా అందుకుంది.

హాలీవుడ్ ఆఫర్లు రాగానే బాలీవుడ్ నుంచి అక్కడకు మఖాం మార్చేసి అక్కడే సెటిల్ అయ్యింది మల్లిక. అక్కడ సినిమాలు, వెబ్ సీరీస్ లతో అక్కడ ఫ్యాన్స్ ని అలరిస్తున్న మల్లికా తన 46వ బర్త్ డే సందర్భంగా సముద్రపు ఒడ్డున ఇసుకలో కూర్చుని బికినీ ట్రీట్ ఇస్తుంది. టూ పీస్ బికినీలో అమ్మడి అందం ఇప్పటికీ మంటలు రేపుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం రజత్ కపూర్ డైరెక్ట్ చేస్తున్న ఆర్కే అనే సినిమాలో నటిస్తుంది మల్లిక. కెరియర్ ప్రారంభించడానికి ముందే ఎయిర్ హోస్టెస్ గా చేస్తున్న టైం లో కరణ్ సింగ్ గిల్ ని పెళ్లాడింది మల్లిక షెరావత్. అయితే సినిమాల్లోకి వచ్చిన కొన్నాళ్లకే అతనికి డైవర్స్ ఇచ్చేసింది.

ఇక 2017 నుంచి ఫ్రెంచ్ బిజినెస్ మ్యాన్ చిరిల్లె ఆక్సెంఫ్యాన్ తో డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం తన స్టేటస్ ఏంటన్నది మాత్రం సీక్రెట్ అని చెప్పొచ్చు. ఈమధ్య సినిమాల్లో కూడా అంత దూకుడు చూపించని మల్లికా షెరావత్ మళ్లీ తిరిగి ఫాం లోకి రావాలని ప్రయత్నిస్తుంది.

ఏజ్ బార్ అవుతున్నా ఎలాంటి సినిమాల్లో అయినా నటించేందుకు రెడీ అంటుంది అమ్మడు. మరి మల్లిక మళ్లీ తన ఫ్యాన్స్ ని అలరించే సినిమాలు రావాలని ఆశిద్దాం అప్పటివరకు తన ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది మల్లిక. తన ఫాలోవర్స్ కి గ్లామర్ ట్రీట్ ఇస్తున్న మల్లిక షెరావత్ లేటెస్ట్ బికినీ స్టిల్ తో చెమటలు పట్టించేస్తుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.