Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ 30లో ఆ సీనియర్ నటి..!

By:  Tupaki Desk   |   4 May 2023 5:36 PM GMT
ఎన్టీఆర్ 30లో ఆ సీనియర్ నటి..!
X
RRR తర్వాత పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఈసారి పాన్ ఇండియా లెవెల్ లో భారీ స్కెచ్ వేశాడు ఎన్టీఆర్. ట్రిపుల్ ఆర్ లో కొమరం భీం పాత్రలో అదరగొట్టిన ఆయన కొరటాల శివ డైరెక్షన్ లో తను చేస్తున్న సినిమాతో ఈసారి అంతకుమించి అనిపించేలా ఉన్నాడు. ఎన్టీఆర్ 30వ సినిమా ఈ మధ్యనే సెట్స్ మీదకు వెళ్లింది. సినిమా నుంచి వస్తున్న క్రేజీ అప్డేట్స్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నాయి. లేటెస్ట్ గా సినిమాలో సీనియర్ నటి మణి చందన నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తొలిప్రేమ, మహేష్ నిజం సినిమాలో నటించిన మణి చందన తెలుగుతో పాటుగా కన్నడ, మలయాళ సినిమాలు చేసింది.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సూపర్ పాపులారిటీ సంపాధించుకున్న ఆమె ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ తల్లి పాత్రలో నటిస్తున్నారు. సినిమాలో మణి చందన పాత్రకు ఇంపార్టెంట్ ఉందని తెలుస్తుంది. అందుకే ఆమెను ఈ పాత్రకు సెలెక్ట్ చేశారట మేకర్స్. ఎన్టీఆర్ 30వ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జాన్వికి ఇది సూపర్ ఆఫర్ అని చెప్పొచ్చు.

ఎన్టీఆర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతుంది శ్రీదేవి తనయురాలు జాన్వి. ఈ సినిమాతో జాన్వి తెలుగు ఆడియన్స్ కు దగ్గర అవ్వాలని చూస్తుంది. బాలీవుడ్ తో పాటుగా టాలీవుడ్ లో కూడా తన పాగా వేయాలని చూస్తుంది జాన్వి కపూర్. అందుకే కొన్నాళ్లుగా డిస్కషన్స్ నడుస్తున్నా ఎన్టీఆర్ సినిమా ఆఫర్ ని పిక్ చేసుకుంది జాన్వి. కచ్చితంగా జాన్వికి ఇది ఒక గొప్ప అవకాశమని చెప్పొచ్చు.

ఎన్టీఆర్ సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ తో గ్లోబల్ లెవెల్ లో ఆడియన్స్ ని మెప్పించిన తారక్ తన 30వ సినిమా వరల్డ్ సినీ లవర్స్ కూడా చూసేలా జాగ్రత్త పడుతున్నారట. మొత్తానికి ఎన్టీఆర్ 30 ఫ్యాన్స్ ఎన్ని అంచనాలు పెట్టుకున్నారో అంతకు మించి ఉంటుందని అర్థమవుతుంది.