Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ : రాజమండ్రి లో మీనాక్షి చౌదరి చీర అందాలు

By:  Tupaki Desk   |   15 Dec 2022 12:30 PM GMT
ఫొటోటాక్ : రాజమండ్రి లో మీనాక్షి చౌదరి చీర అందాలు
X
ఇచట వాహనాలు నిలుపరాదు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి. ఈ అమ్మడి యొక్క నటన మరియు అందంతో మొదటి సినిమాతోనే మెప్పించింది. ఆ తర్వాత ఖిలాడీ సినిమాలో కూడా నటించి మెప్పించింది. హీరోయిన్ గా ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత కు ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు.

హిట్‌ 2 సినిమాలో అడివి శేష్‌ కు జోడీగా నటించి మరోసారి మీనాక్షీ చౌదరి మెప్పించింది. తాజాగా ఈ అమ్మడు రాజమండ్రిలో సందడి చేసింది. ముద్దుగుమ్మ చీర కట్టు లో ఏమాత్రం స్కిన్‌ షో చేయకుండా కూడా వావ్‌ అనిపించేంత అందంగా ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ఎల్లో చీర కట్టు లో మీనాక్షి చౌదరి ని చూస్తూ ఉంటే చూపు తిప్పుకోలేకుండా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. వరుసగా ఈ అమ్మడికి ఆఫర్లు వస్తున్న నేపథ్యంలో బిజీ బిజీగా షూటింగ్‌ లో పాల్గొంటుంది. ఇటీవల ఒక సినిమా షూట్‌ లో భాగంగా రాజమండ్రిలో సందడి చేసిందనే వార్తలు వస్తున్నాయి. అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక ఈ అమ్మడు మిస్ ఇండియా గా నిలిచి బాలీవుడ్ లో కూడా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. అక్కడ ఇక్కడ ఆఫర్ల తో దూసుకు పోతున్న మీనాక్షి చౌదరి ప్రస్తుతం పాన్ ఇండియా బిగ్గెస్ట్‌ మూవీ సలార్ లో నటిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. కీలక పాత్రలో సలార్ సినిమాలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.