Begin typing your search above and press return to search.

'రంగస్థలం' రామలక్ష్మి సీన్ కి టిక్ టాక్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ...!

By:  Tupaki Desk   |   24 May 2020 6:49 AM GMT
రంగస్థలం రామలక్ష్మి సీన్ కి టిక్ టాక్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ...!
X
రామ్ చరణ్ - సమంత హీరో హీరోయిన్స్ గా నటించిన 'రంగస్థలం' సినిమా ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో మనందరికీ తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చరణ్ 'చిట్టిబాబు'గా.. సమంత 'రామలక్ష్మి'గా నటించి ప్రేక్షకులను మెప్పించారు. వీరిద్దరి పల్లెటూరి ఇన్నోసెంట్ రొమాన్స్ బాగా క్లిక్ అయ్యిందని చెప్పవచ్చు. 90ల కాలం నాటి అమ్మాయి, అబ్బాయిల పల్లెటూరి ప్రేమ కథను ఈ సినిమాలో అద్భుతంగా తెరకెక్కించారు. ముఖ్యంగా చరణ్ - సామ్ ల మధ్య వచ్చే ప్రతీ సీన్ బాగా పండిందని చెప్పవచ్చు. వాటిలో చెవిడివాడైన చిట్టిబాబుకి తన ప్రేమను చెప్పే క్రమంలో రామలక్ష్మి పడే ఇబ్బందిని చాలా ఫన్నీగా చూపించారు. ఒక సందర్భంలో రామలక్ష్మి తాను ప్రేమించిన విషయాన్ని చిట్టిబాబుకి తెలియజేస్తూ ''నువ్వంటే నాకిట్టం.. ఇలాగే సెప్తాను..'' అంటూ చెప్పే సీన్ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. లవ్ ప్రపోజల్ ని తిట్టుగా భావించిన చిట్టిబాబు చేసే హడావిడి థియేటర్స్ హిలేరియస్ గా పేలింది. ఈ సీన్ ఆ తర్వాత టిక్ టాక్ వీడియోలతో మారుమోగి పోయింది. ఇప్పుడు లేటెస్టుగా దీనికి టాలీవుడ్ బ్యూటీ దీక్షా పంత్ టిక్ టాక్ వీడియో చేసి అలరించింది.

దేశ వ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన సినీ సెలబ్రెటీలు అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో మామూలుగానైతే ఎప్పుడు కొంచెం ఖాళీ సమయం దొరికినా ప్రపంచాన్ని చుట్టేసే వాళ్ళు ఇప్పుడు ఇంట్లోనే లాక్ అయ్యారు. ఇంట్లోనే ఉంటూ బోర్ కొడుతుండ‌డంతో సోష‌ల్ మీడియాలో ర‌క‌రకాల పోస్టులు పెడుతూ టైమ్ పాస్ చేస్తున్నారు. ఇంట్లో ఖాళీగా కూర్చుని ఏం చేయాలో అర్థం కాని సెలబ్రిటీలు వర్కౌట్స్ చేస్తూ.. టిక్ టాక్ వీడియోలు చేస్తూ తమకు దొరికిన ఈ ఖాళీ సమయాన్ని ఎవరికి తోచినట్టుగా వాళ్లు ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే బిగ్ బాస్ బ్యూటీ దీక్షా పంత్ కూడా రామలక్ష్మి టిక్ టాక్ వీడియోతో అలరించింది. 'రంగస్థలం' రామలక్ష్మిలా లంగా ఓణీ ధరించి సమంత లా మారిపోయింది. సామ్ ని అనుకరిస్తూ ఆమె ఇచ్చిన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అందర్నీ ఆకర్షిస్తున్నాయి. నెటిజెన్స్ కి ఈ వీడియో నచ్చేడంతో లైకులు కొడుతూ వైరల్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా దీక్షా పంత్ 'ఒక లైలా కోసం' 'కవ్వింత' 'గోపాల గోపాల' 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాలలో కనిపించింది. ధనరాజ్ హీరోగా నటించిన 'బంతి పూల జానకి' సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం నాలుగు తెలుగు సినిమాలను లైన్లో పెట్టిన దీక్షా ఒక హిందీ సినిమాలో కూడా నటిస్తోంది. వేరే ఇండస్ట్రీలలో ఆఫర్స్ వచ్చినా మొదటి ప్రాధాన్యత టాలీవుడ్ కే అని చెప్పుకొచ్చింది.


వీడియో కోసం క్లిక్ చేయండి