Begin typing your search above and press return to search.
డ్రగ్స్ కేసు: టెస్ట్ కోసం మూత్రం అడిగితే.. సీసాలో నీళ్లు నింపి ఇచ్చిన హీరోయిన్
By: Tupaki Desk | 13 Sep 2020 7:15 AM GMTబాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు సౌత్ సినీ ఇండస్ట్రీలను సైతం వణికిస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ కేసు విచారణలో భాగంగా తెరపైకి వచ్చిన డ్రగ్స్ మాఫియా సినీ ఇండస్ట్రీని కుదిపిస్తోంది. శాండిల్ వుడ్ డ్రగ్ మాఫియా కేసు విచారణ చేస్తున్న బెంగుళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు డ్రగ్స్ వినియోగం.. సరఫరా వంటి కేసుల్లో ఇప్పటికే హీరోయిన్స్ రాగిణి ద్వివేది - సంజనాలను అరెస్టు చేశారు. వీరితో పాటు డ్రగ్స్ రాకెట్ తో సంబంధం ఉన్న రాహుల్ - వీరేన్ ఖన్నా - రవిశంకర్ తదితరులు అరెస్టు అయ్యారు. ప్రస్తుతం సంజనా మరియు రాగిణి ద్వివేదిలు మడివాళ మహిళా సంరక్షణ పునర్వసతి కేంద్రంలో పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఈ క్రమంలో సంజన రక్త నమూనాలు ఇవ్వడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది.
మరోవైపు రాగిణి వ్యవహరిస్తున్న తీరు కూడా పోలీసులను విస్మయానికి గురించేస్తోందట. శనివారం రాగిణి ఆరోగ్యపరమైన టెస్టులు కోసం వైద్యులు సంప్రదించగా ఆమె వారికి ఊహించని షాక్ ఇచ్చిందని తెలుస్తోంది. మూత్ర పరీక్షల కోసం రాగిణికి ఒక చిన్న సీసా ఇవ్వగా.. అందులో ఆమె మూత్రానికి బదులు నీళ్లు పోసి ఇచ్చిందట. రాగిణి చేసిన పనికి వైద్యులతో పాటు అధికారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారట. ఆ తరువాత రాగిణి ఏమి మాట్లాడకపోవడంతో.. చివరకు ఓ మహిళా పోలీసు చేత ఆమెకు అవసరమైన పరీక్షలు నిర్వహించారని తెలుస్తోంది. ప్రస్తుతం రాగిణి చేసిన వ్యవహారం కన్నడ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా బినామీ పేర్లతో రాగిణి దగ్గర ఆస్తులు చాలానే ఉన్నాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈడీ అధికారులు ఆమె ఆస్తులపై ద్రుష్టి పెట్టినట్లు తెలుస్తోంది.