Begin typing your search above and press return to search.

కూతుళ్లు అంటే న‌మ్ముతారా.. సిస్ట‌ర్స్ అనాలి!

By:  Tupaki Desk   |   21 April 2020 5:30 AM GMT
కూతుళ్లు అంటే న‌మ్ముతారా.. సిస్ట‌ర్స్ అనాలి!
X
ఎయిటీస్ స్టార్ల‌లో న‌దియా రేంజే వేరు. అందానికి అందం .. అందుకు త‌గ్గ‌ట్టు న‌ట‌న ఉన్న స్పైసీ బ్యూటీగా పాపుల‌రయ్యారు అప్ప‌ట్లో. త‌మిళంలో మెజారిటీ స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించారు. 1985 లో ఫాజిల్ దర్శకత్వం వహించిన `పూవ్ పూచుదవ` అనే చిత్రంతో లెజెండ‌రీ నటి పద్మినికి కోస్టార్ గా న‌టించి మెప్పించారు. ఆ చిత్రంతో తమిళ సినిమాల్లోకి అడుగుపెట్టారు. తొలి ప్ర‌య‌త్న‌మే వీరాభిమానుల్ని సంపాదించుకుని డ్రీమ్ గర్ల్ అయ్యారు. ఆ తర్వాత రజనీకాంత్.. మోహన్ .. విజయకాంత్, సత్యరాజ్.. ప్రభు.. సురేష్ వంటి టాప్ హీరోల సరసన పలు చిత్రాల్లో నటించారు. ఆ క్ర‌మంలోనే 1988 లో అమెరికాకు చెందిన వ్యాపారవేత్త శిరీష్ గాడ్ బోల్ ను వివాహం చేసుకుని సెటిల‌య్యారు. కెరీర్ పీక్స్ లో ఉండ‌గానే.. కాపురానికి లండన్ కు వెళ్లిపోయారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. 1996 లో తొలి సంతానం క‌లిగింది. స‌న‌మ్ పెద్ద కుమార్తె. 2001లో రెండో అమ్మాయి జానా జన్మించింది.

ప్ర‌స్తుతం తన కుటుంబంతో కలిసి చెన్నైలో స్థిరపడిన న‌దియా మిర్చి చిత్రంతో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక నదియా ఇన్ ‌స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ ‌గా ఉంటారు. అయితే ఇన్నాళ్లుగా న‌దియా త‌న కుటుంబానికి సంబంధించిన ఫోటో ఏదీ రివీల్ చేయ‌లేదు. తొలిసారిగా ఆమె కుమార్తెలు సనమ్ - జానాల‌తో క‌లిసి ఉన్న ఫోటోని షేర్ చేశారు. ఇద్దరు గారాల ప‌ట్టీలు తమ అందమైన తల్లితో ఎంతో ఆప్యాయంగా ఇలా ఫోటో దిగారు.

అన్న‌ట్టు ఈ ఫోటో చూస్తుంటే ఫ్యాన్స్ కి ఏమ‌నిపిస్తోంది? అస‌లు ఆవిడకు కూతుళ్లు ఉన్నారంటే న‌మ్మే ప‌రిస్థితే లేదు. ఆ ముగ్గురూ సిస్ట‌ర్సా? అని సందేహం వ్య‌క్తమ‌వుతోంది. అంత ఇదిగా అందాన్ని కాపాడుకుంటున్నారు కాబ‌ట్టే న‌దియా మ్యాడ‌మ్ కి ఇటు తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఆ రేంజులో అవ‌కాశాలు ద‌క్కాయ‌న్న‌మాట‌. రీఎంట్రీలో టాలీవుడ్ టాప్ హీరోల సినిమాల్లో కీల‌క పాత్ర‌లు పోషించిన ఘ‌న‌త న‌దియా ద‌క్కించుకున్నారు. ఈ ఏజ్ లోనూ న‌దియా ఎన‌ర్జీ ఆల్వేస్ హాట్ టాపిక్. న‌దియా రీఎంట్రీ లో సాధించిన ఘ‌న‌త చూశాక‌.. త‌నను ఫాలో అవుతూ ప‌లువురు వెట‌ర‌న్ బ్యూటీస్ రీఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తిని క‌న‌బ‌రిచిన సంగ‌తి తెలిసిందే.