Begin typing your search above and press return to search.

నాగబాబు మళ్ళీ గెలకడమెందుకు?

By:  Tupaki Desk   |   6 Oct 2022 2:49 PM GMT
నాగబాబు మళ్ళీ గెలకడమెందుకు?
X
ఉదయం నుంచి మెగాస్టార్ చిరంజీవి - గరికపాటి నరసింహారావుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దసరా రోజు ప్రత్యేకంగా మెగాస్టార్ చిరంజీవి నాంపల్లిలో నిర్వహించిన వేడుకకు వెళ్ళిన విషయం తెలిసిందే. అయితే ఆ ఈవెంట్ లో చాలామంది రాజకీయ నాయకులు పాల్గొన్నారు. ఇక వారి కుటుంబ సభ్యులు కూడా మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేకంగా కలుసుకున్నారు.

ఇక మెగాస్టార్ చిరంజీవితో వారు ప్రత్యేకంగా ఫోటోలు దిగేందుకు ఆసక్తిని చూపించారు. మెగాస్టార్ కూడా ఒక్కొక్కరికి ఫొటో ఇవ్వకుండా అందరికీ కలిపి ఒకేసారి ఫోటో ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే మెగాస్టార్ ఆ విధంగా ఫోటోలు స్టార్ట్ చేసినప్పుడే గరికపాటి కూడా తన ప్రవచనాలను మొదలుపెట్టారు. అందరి ఫోకస్ కూడా అప్పుడు చిరు పైనే పడింది. ఈ క్రమంలో గరికపాటి గారు కొంత అసహనంతో వెంటనే ఆ ఫోటో సెషన్ ఆపకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అనే తరహాలో అసంతృప్తి వ్యక్తం చేశారు.

వెంటనే చిరంజీవి గారు తన పక్కన వచ్చి కూర్చోవాలని కూడా అన్నారు. అయితే మెగాస్టార్ ఆ తర్వాత వెంటనే అక్కడికి వచ్చి గరికపాటితో కూడా మాట్లాడారు. మెగాస్టార్ మాట్లాడే సమయంలో గరికపాటి గురించి ప్రత్యేకంగా మాట్లాడారు కూడా. మీ ప్రవచనాలు తరచుగా నేను వింటూ ఉంటాను అని దాదాపు మీ తరహాలోనే ఆలోచిస్తాను అని కూడా అన్నారు. అంతేకాకుండా మీకు పద్మశ్రీ వచ్చినప్పుడు నేను కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాను అనే విషయాన్ని కూడా గుర్తు చేసిన మెగాస్టార్ మీలాంటి వారి ఆశీర్వాదం తనకు ఉండాలి అని కోరుకున్నారు.

అందుకు గరికపాటి కూడా చాలా వినయంగా మెగాస్టార్ తో మాట్లాడారు. అయితే ఆ గొడవ అంతటితో నిలిచిపోయిన సమయంలో ఇప్పుడు నాగబాబు అనవసరంగా మళ్ళీ ఆ విషయం పై స్పందించిన విధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. 'ఏపాటి వాడికైనా  చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే..' అని నాగబాబు గరికపాటి పేరు ఎత్తకుండానే పదజాలంతో ఆయనకు కౌంటర్ ఇచ్చినట్లుగా అర్థమవుతోంది. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు చాలావరకు నాగబాబు స్పందన పై రియాక్ట్ అవుతున్నారు. అనవసరంగా అయిపోయిన గొడవను మళ్ళీ గెలకడం ఎందుకు అనే విధంగా కూడా స్పందిస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.