Begin typing your search above and press return to search.

భ‌ర్త‌తో న‌మిత స‌ర‌స స‌ల్లాపం అదిరెనులే

By:  Tupaki Desk   |   8 Sep 2020 9:50 AM GMT
భ‌ర్త‌తో న‌మిత స‌ర‌స స‌ల్లాపం అదిరెనులే
X
భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య అనుబంధం ఎలా ఉందో చెప్పేందుకు ఒకే ఒక్క ఫోటో చాలు. ఇదిగో అలాంటి ఓ అరుదైన ఫోటోని షేర్ చేసింది అందాల న‌మిత‌. తాజాగా నమిత తన ఇన్ ‌స్టాలో షేర్ చేసిన ఫోటో వైర‌ల్ గా మారింది. ఆమె త‌న‌ హబ్బీ వీరేంద్ర చౌదరితో ఎంతో స‌న్నిహితంగా లాల‌న‌గా గ‌డిపేస్తున్న ఈ ఫోటో యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారింది.

``మేం ఇద్దరూ కలుసుకుని నాలుగు సంవత్సరాలు అయ్యింది. ఆ సమయంలో ఒక నదిలో నీటి ప్ర‌వాహంలా సాగాం. ఇంకా 40 ఏళ్లు ఇలానే.. చీర్స్!`` అంటూనే ఆమె హబ్బీ చెంపపై ముద్దు పెడుతోంది. ఎంతో నేచుర‌ల్ గా బ్యూటిఫుల్ గా ఉందీ ఫోటో.

ఇక వేరొక ఫోటోలో హ‌బ్బీ నేల‌పై బార్లా ప‌డుకుని ఉండ‌గా.. త‌న వీపుపైన కూచుని శివంగిలా ఫోజిచ్చింది. ఇక న‌మిత బ్యాక్ లెస్ ఫోజు గుబులు రేపుతోంది. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య స‌ర‌సం అదిరింది. కుర్రాళ్ల హృద‌యాల్ని ట‌చ్ చేస్తున్నాయి ఈ ఫోటోలు. ఇక కోలీవుడ్ లో ప్ర‌ముఖుడైన వీరేంద్ర చౌద‌రిని న‌మిత ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే.