Begin typing your search above and press return to search.
డ్రగ్స్ ను వాడేసుకుంటున్న నయన్
By: Tupaki Desk | 20 July 2017 4:34 AM GMTఓ వివాదం నెలకొంటే.. దాన్ని పక్కాగా ఉపయోగించేసుకోవాలనే ఆలోచన చాలా మంది మూవీ మేకర్స్ లో ఉంటుంది. డ్రగ్ స్కాండల్ లో నోటీసులు అందుకున్నాడంటూ యంగ్ హీరో తనీష్ పై ఆరోపణలు వస్తే.. పనిలో పనిగా ప్రేమిక అనే తన సినిమాకి ప్రచారం కోసం వాడేశాడు. ఇలా వివాదాన్ని సినిమా కోసం ఉపయోగించే జాబితాలోకి నయనతార కూడా చేరుతోంది.
నయనతార ప్రధాన పాత్రలో వాసుకి అనే సినిమా రిలీజ్ కి సిద్ధమైంది కానీ.. సరైన టైమింగ్ దొరక్క ఇంకా థియేటర్లలోకి రాలేదు. ముమ్మట్టి కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో.. స్టోరీ లైన్ డ్రగ్ అడిక్ట్స్ కి లింక్ అయి ఉంటుంది. అంటే.. కొంతమంది డ్రగ్స్ బానిసలు.. హీరోయిన్ నయనతారను రేప్ చేస్తే.. వారిపై నయన్ ఎలా పగ తీర్చుకుంది.. ఆ రివెంజ్ స్టోరీకి ముమ్మట్టి కి లింక్ ఏంటనేదే ఈ వాసుకి మూవీ. మలయాళంలో పుథియ నియమం పేరుతో వచ్చిన ఈ చిత్రం మంచి సక్సెస్ కాగా.. ఇఫ్పుడు తెలుగులోకి తెచ్చేస్తున్నారు.
సరిగ్గా ఇదే సమయానికి టాలీవుడ్ లో డ్రగ్స్ ఉదంతం నెలకొనడంతో.. టైమింగ్ ప్రకారం పక్కాగా కలిసొచ్చేసింది. ఇక తెలుగు నిర్మాతలు ఊరుకుంటారా.. డ్రగ్స్ బ్యాక్ డ్రాప్.. వాటి కారణంగా మహిళలపై వేధింపులు.. ప్రస్తుత సమాజంలో నెలకొన్న ఇబ్బందులు అనే యాంగిల్ లో ప్రచారం స్టార్ట్ చేసేశారు. రివెంజ్ స్టోరీకి ఇలాంటి ప్రచారం అవసరమా అనుకోవచ్చు గాక.. కానీ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లాలంటే ఏదో ఒక క్యాచీ పాయింట్ కావాలి కదా!