Begin typing your search above and press return to search.

మహేష్‌.. బన్నీ.. విజయ్‌ దేవరకొండ ఇప్పుడు నయనతార

By:  Tupaki Desk   |   21 May 2023 12:01 PM GMT
మహేష్‌.. బన్నీ.. విజయ్‌ దేవరకొండ ఇప్పుడు నయనతార
X
ఒక వైపు దేశ వ్యాప్తంగా థియేటర్‌ రంగం కుదేలవుతున్న ఈ సమయంలో స్టార్స్‌ భారీగా ఖర్చు చేసి మల్టీప్లెక్స్ ల నిర్మాణం చేపట్టారు. ఏషియన్‌ సంస్థ తో కలిసి హైదరాబాద్ లో మహేష్ బాబు ఏఎంబీ మల్టీ ప్లెక్స్ ను ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. ఆ మల్టీప్లెక్స్ కి మంచి క్రేజ్ దక్కి.. సినిమాతో సంబంధం లేకుండా జనాలు క్యూ కడుతున్నారు.

మహేష్ బాబు మల్టీ ప్లెక్స్ అంటూ అక్కడకు బారులు తీరుతున్నారు. మహేష్ బాబు మల్టీ ప్లెక్స్ తర్వాత విజయ్ దేవరకొండ మరియు అల్లు అర్జున్‌ లతో కలిసి కూడా ఏషియన్స్ వారు మల్టీ ప్లెక్స్ ల నిర్మాణం చేపట్టారు. ఇది ఒక కొత్త బిజినెస్‌ గా ఉండటంతో పాటు మంచి లాభాలను తెచ్చి పెడుతున్న నేపథ్యంలో పలువురు స్టార్స్ మల్టీ ప్లెక్స్ బిజినెస్ పై ఆసక్తి చూపిస్తున్నారు.

ఇప్పటి వరకు హీరోలు మాత్రమే మల్టీ ప్లెక్స్ బిజినెస్‌ లో ఉన్నారు. ఇప్పుడు లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార మల్టీ ప్లెక్స్ రంగంలో అడుగు పెట్టబోతుంది. ఇప్పటికే ఆమె చెన్నైలోని మూత పడ్డ సింగిల్ స్క్రీన్ థియేటర్‌ అగస్త్య ను కొనుగోలు చేసింది. భర్త విగ్నేష్ శివన్ తో కలిసి ఆ థియేటర్‌ ప్లేస్ లో కొత్త మల్టీ ప్లెక్స్ అండ్ మాల్ నిర్మాణం చేపట్టినట్లుగా తెలుస్తోంది.

చెన్నైలోనే అత్యంత విలాసవంతమైన మల్టీ ప్లెక్స్ గా నయనతార మల్టీప్లెక్స్ ఉండేలా అత్యాధుని హంగులతో ఏర్పాటు చేయబోతున్నారట. ప్రస్తుతం అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని.. త్వరలోనే పనులు మొదలు కాబోతున్నట్లుగా చెన్నై సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. నయనతార హీరోయిన్ గా.. నిర్మాతగా సూపర్‌ హిట్ అయ్యారు. కనుక మల్టీప్లెక్స్ యజమానిగా కూడా సక్సెస్ అయ్యేనా చూడాలి.