Begin typing your search above and press return to search.

పాపం రాధిక మేడం ను పట్టించుకునే వాళ్లే కరువయ్యారు

By:  Tupaki Desk   |   7 Feb 2023 8:00 AM GMT
పాపం రాధిక మేడం ను పట్టించుకునే వాళ్లే కరువయ్యారు
X
2018 సంవత్సరంలో ఆకాష్‌ పూరి తో కలిసి మెహబూబా సినిమాలో నటించిన ముద్దుగుమ్మ నేహా శెట్టి. మొదటి సినిమా ఫ్లాప్ అయినా కూడా తెలుగులో ఈ అమ్మడికి గల్లీ రౌడీ సినిమాలో సందీప్‌ కిషన్ కు జోడీగా నటించే అవకాశం సొంతం చేసుకుంది. ఆ సినిమా కూడా ఫ్లాప్ అవ్వడంతో అఖిల్ సినిమా మోస్ట్‌ ఎలిజబుల్ బ్యాచిలర్ లో కీలక పాత్రలో కనిపించింది.

అదృష్టం కొద్ది ఈ అమ్మడికి సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు సినిమా లో ఛాన్స్ దక్కింది. ఆ సినిమాలోని రాధిక పాత్రకు ఈ అమ్మడు భలే సెట్‌ అయ్యిందనే టాక్‌ వినిపించింది. హీరోయిన్‌ గా డీజే టిల్లు తర్వాత ఈ అమ్మడు వరుసగా స్టార్‌ హీరోల సినిమాలకు సైన్ చేయడం ఖాయం అంటూ చాలా మంది విశ్వసించారు. కానీ అలా జరగలేదు.

డీజే టిల్లు సినిమా వచ్చి ఏడాది కావస్తున్నా ఇప్పటివరకు మరో విజయాన్ని ఈ అమ్మడు సొంతం చేసుకోలేక పోయింది. కనీసం ఒక మంచి సినిమాలో నటించే అవకాశం దక్కించుకోలేక పోయింది. బెదురులంక 2012 సినిమాలో ఈ అమ్మడు నటించింది. ఆ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది.

బెదురు లంక సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ సినిమాతో అయినా ఈ అమ్మడికి గుర్తింపు దక్కుతుందా అనేది చూడాలి. ప్రస్తుతానికి ఆమె చేతిలో సినిమాలు ఏమీ లేవు. ఒకటి రెండు చర్చల దశలో ఉన్నాయి అనేది టాక్‌. అవి అయినా ఫైనల్‌ అవుతాయా అనేది చూడాలి. రాధిక గా మంచి పాపులారిటీని దక్కించుకున్న నేహా శెట్టి కి ఇలా ఆఫర్లు లేకపోవడం విడ్డూరంగా ఉంది.