Begin typing your search above and press return to search.

రాధిక అక్క టార్గెట్ వేరే ఉంది..తెలిస్తే స్ట‌న్ అవ్వాల్సిందే!

By:  Tupaki Desk   |   24 April 2022 4:30 PM GMT
రాధిక అక్క టార్గెట్ వేరే ఉంది..తెలిస్తే స్ట‌న్ అవ్వాల్సిందే!
X
హీరోయిన్ గా క్లిక్ అవ్వ‌డం పై ల‌క్ ప్యాక్ట‌ర్ కూడా కొంత వ‌ర‌కూ ప‌నికొస్తుంది. తెరంగేట్రం చేసిన భామ‌లంద‌రూ స్టార్ హీరోయిన్లు అయిపోలేరు. అది కొంద‌రికి సాధ్యం అవుతుంది. దానికి వెనుక ఎన్నో కార‌ణాలుంటాయి. గ్లామ‌ర్ తో పాటు ట్యాలెంట్ కూడా కీల‌క పాత్ర పోషిస్తుంది. హీరోయిన ఫ‌రిదిలో ట్యాలెంట్ తో మాత్ర‌మే నెట్టుకురావ‌డం అన్న‌ది అన్ని చోట్లా వ‌ర్కౌట్ అవ్వ‌దు. అదే గ‌నుక నిజ‌మైతే సాయిప‌ల్ల‌వి ఇప్ప‌టికే అనుష్క లాంటి భామ‌ల్ని బీట్ చేసేసేది.

ప్ర‌తిభ గ‌ల న‌టే అయినా.. ఏదో తెలియ‌ని ప్యాక్ట‌ర్ ఆమెని వెన‌క్కి లాగిపోడుతుంది. కానీ ఆమెక‌న్నా వెన‌కొచ్చిన ర‌ష్మిక మంద‌న్న ఆమెని మించిన స్టార్ డ‌మ‌య్ ని త‌క్కువ స‌మ‌యంలోనే సొంతం చేసుకుంది.`ఛ‌లో` స‌క్సెస్ తో పాటు అటుపై వ‌చ్చిన స‌క్సెస్ లతో పాటు అమ్మ‌డి బ్యూటీ యాంగిల్ ని ఆమెని శిఖ‌ర స్థానంలో నిల‌బెట్టాయి. ఇలాగే టాలీవుడ్ లో వెలిగిపోవాల‌ని కోటి ఆశ‌ల‌తో ఎంట్రీ ఇచ్చింది క‌న్న‌డ బ్యూటీ నేహాశెట్టి.

అమ్మ‌డు తొలి సినిమా `మెహబూబా`లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. మొద‌టి సినిమానే డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాధ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించే అరుదైన అవ‌కాశం అందుకుంది. కానీ ఆ సినిమా ఫ‌లితం ఆమెని ఎక్క‌డికో తీసుకెళ్లింది. ఆ ప్లాప్ త‌ర్వాత ఏ ద‌ర్శ‌క‌..నిర్మాత ఆమెవైపు చూడ‌లేదు. కొంత గ్యాప్ త‌ర్వాత `డీజేటిల్లు` చిత్రంలో అవ‌కాశం అందుకుంది.

ఇటీవ‌ల రిలీజ్ అయిన సినిమాతో అమ్మ‌డు టాలీవుడ్ లో బాగా ఫేమ‌స్ అయింది. రాధిక అక్క‌గా యువ‌త‌కి బాగా ద‌గ్గ‌రైంది. అయితే ఇప్పుడీ భామ అగ్ర హీరోల సినిమాల కోసం వెయిట్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. మ‌హేష్‌..రామ్ చ‌ర‌ణ్‌...బ‌న్నీ లాంటి స్టార్ హీరోల‌తో క‌లిసి ప‌నిచేయాలని టార్గెట్ గా పెట్టుకుందిట‌. అయితే ఈ విష‌యాలు ఎక్క‌డా ఓపోన్ అవ్వ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డుతుందిట‌. ఇదే స‌మ‌యంలో వ‌చ్చిన మీడియం రేంజ్ హీరోల్ని వ‌దిలి పెట్ట‌కూడ‌ద‌ని భావిస్తోంది.

ఇటీవ‌లే యువ హీరో కార్తికేయ హీరోగా న‌టిస్తోన్న కొత్త చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైన సంగ‌తి తెలిసింది. డీజే టిల్లు స‌క్సెస్ తో వ‌చ్చిన అవ‌కాశం ఇది. ఆ స‌క్సెస్ లేక‌పోతే నేహాశెట్టి ఇంకా ఇంటికే ప‌రిమిత‌మ‌వ్వాల్సి వ‌చ్చేది. కార‌ణాలు ఏవైనా ఇన్నాళ్లు వెయిట్ చేసినందుకు ఒక్కో ఆఫ‌ర్ బాగానే అందుకుంటుంది.