Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : ఇస్మార్ట్‌ నిధి క్యూట్‌నెస్ కి ఫిదా అవ్వాల్సిందే

By:  Tupaki Desk   |   20 Dec 2022 11:30 PM GMT
ఫొటోటాక్‌ : ఇస్మార్ట్‌ నిధి క్యూట్‌నెస్ కి ఫిదా అవ్వాల్సిందే
X
మిస్టర్‌ మజ్ను మరియు సవ్యసాచి సినిమాలతో హీరోయిన్‌ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌. ఈ అమ్మడికి హీరోయిన్‌ గా ఇస్మార్ట్‌ శంకర్ తో సక్సెస్ దక్కింది. ఆ సినిమా తో వరుసగా ఆఫర్లు వస్తాయని ఆశించిన సమయంలో అనూహ్యంగా కరోనా వల్ల సినిమా షూటింగ్స్ నిలిచి పోయి ఆఫర్లు రాలేదు.

షూటింగ్స్ పునః ప్రారంభం అయిన తర్వాత ఈ అమ్మడికి ఆఫర్లు అడపా దడపా వస్తున్నాయి. అయితే పవన్‌ కళ్యాణ్ తో ఈ అమ్మడు నటిస్తున్న హరి హర వీరమల్లు సినిమా కచ్చితంగా ఈ అమ్మడికి స్టార్‌ డమ్‌ ను తెచ్చి పెట్టడంతో పాటు ఓ రేంజ్‌ లో ఆఫర్లను కూడా తెచ్చి పెట్టడం ఖాయం అని అంతా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

సినిమాల్లో ఏ స్థాయిలో అందాలను ఆరబోస్తుందో.. అదే స్థాయిలో సోషల్‌ మీడియాలో కూడా ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఉంటుంది. ఒక మాట చెప్పాలంటే అంతకు మించి అన్నట్లుగానే ఈ అమ్మడు అందాలను ఆరబోస్తూ ఆకట్టుకుంటూ ఉంది. తాజాగా స్కిన్‌ షో చేయకుండా క్యూట్‌ ఫొటోలతో అలరించింది.

సింపుల్‌ గా బ్లాక్ షర్ట్‌ లో ఈ అమ్మడు కనిపించిన తీరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జుట్టు ను అలా ముందుకు వేసుకుని క్యాజువల్‌ గా ఫొటోలకు ఫోజ్ ఇచ్చిన నిధి అగర్వాల్‌ యొక్క అందానికి చాలా మంది ఫిదా అవుతున్నారు. స్కిన్‌ షో చేయకున్నా కూడా ఇలా చాలా క్యూట్ గా నిధి అగర్వాల్‌ ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.