Begin typing your search above and press return to search.

ఇస్మార్ట్‌ నిధి చీరలో అందాల విందు

By:  Tupaki Desk   |   29 Dec 2022 2:30 AM GMT
ఇస్మార్ట్‌ నిధి చీరలో అందాల విందు
X
సవ్యసాచి మరియు మిస్టర్ మజ్ను సినిమాలతో హీరోయిన్ గా టాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌. మొదటి రెండు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద నిరాశ పర్చడంతో ఈ అమ్మడి కెరీర్ ముందుకు సాగడం కష్టమే అని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఈ అమ్మడికి ఇస్మార్ట్‌ సక్సెస్ దక్కడంతో కెరీర్‌ లో దూసుకు పోతుంది.

రామ్‌ హీరోగా పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో రూపొందిన ఇస్మార్ట్‌ శంకర్ సినిమా లో నిధి అగర్వాల్‌ హీరోయిన్ గా నటించి మెప్పించిన విషయం తెల్సిందే. ఆ సినిమా సూపర్‌ హిట్‌ అయిన వెంటనే పవన్‌ కళ్యాణ్ కు జోడీగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న హరి హర వీరమల్లు సినిమా లో నటించే అవకాశం దక్కించుకుంది.

సినిమాల్లో ఏ స్థాయిలో అందాలను ఈ అమ్మడు ఆరబోస్తూ ఉంటుందో సోషల్‌ మీడియాలో అంతకు మించి అన్నట్లుగా ఈ అమ్మడి అందాల ఆరబోత ఉంటుంది. ఆకట్టుకునే ఫిజిక్ తో పాటు మంచి కలర్‌ ఇంకా బాడీ లాంగ్వేజ్ ఉన్న నిధి అగర్వాల్‌ ఏ ఫొటోలు షేర్‌ చేసినా కూడా జనాలు వావ్‌ అనాల్సిందే.

హీరోయిన్ గా నిధి అగర్వాల్‌ అందాల ఆరబోతకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తాజాగా చీర కట్టులో క్లీ వేజ్ షో చేస్తూ ఓరకంట చూస్తూ తన చూపులతో మత్తెక్కిస్తున్న ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌ ఊరిస్తుంది. నిధి అగర్వాల్‌ అందాలకు ఎంతటి వారు అయినా ఫిదా అవ్వాల్సిందే అన్నట్లుగా ఈ ఫొటోలు ఉన్నాయి.

చీర కట్టులో అందాల నిధిని చూస్తూ ఉంటే ఆహా అనిపిస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అందాల ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌ హరి హర వీరమల్లు సినిమా తర్వాత టాలీవుడ్‌ లో మోస్ట్‌ బిజీ హీరోయిన్‌ గా మారే అవకాశాలు ఉన్నాయి అనిపిస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.