Begin typing your search above and press return to search.

హాయ్ బ్యూటీ.. పెళ్లి షాక్ ఇచ్చింది

By:  Tupaki Desk   |   6 Oct 2016 4:30 AM GMT
హాయ్ బ్యూటీ.. పెళ్లి షాక్ ఇచ్చింది
X
నికిత తుక్రల్.. హాయ్ అంటూ ఇవివి వారసుడు ఆర్యన్ రాజేష్ కి హీరోయిన్ గా సినీ అరంగేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగుతో పాటు మలయాళం.. తమిళ్.. కన్నడ భాషల్లో చాలానే సినిమాలు చేసిన నికిత.. సడెన్ గా పెళ్లి కబురు చెప్పి అందరకీ షాక్ ఇచ్చేసింది. రీసెంట్ గానే హిందీలోనూ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. పెళ్లిమాట ఇంత తొందరగా చెప్పేస్తుందని ఎవరూ అనుకోలేదు. పైగా ఇది లవ్ మ్యారేజ్ కూడా కావడం చెప్పుకోవాల్సిన విషయం.

ముంబైకి చెందిన ఇండస్ట్రియలిస్ట్ గగన్ దీప్ సింగ్ మాగోను పెళ్లి చేసుకుంటోంది నికిత. పెళ్లి వేడుకలు ఇప్పటికే మొదలైపోయాయ్ కూడా. ఇవాళే మెహందీ పంక్షన్ కాగా.. రేపు సంగీత్.. ఆ తర్వాత రోజు పెళ్లి.. ఆ నెక్ట్స్ రిసెప్షన్. ఇలా నాలుగు రోజుల పెళ్లిన ఘనంగా జరుపుకొంటోంది నికిత. 'మా కజిన్ పెళ్లిలో గతేడాది డిసెంబర్ లో గగన్ ని కలిశాను. మాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్. నా సిస్టర్ ద్వారా నన్ను కలిసి మాట్లాడాడు. ఆ సమయంలో మా అమ్మకు హెల్త్ బాగోలేకపోవడంతో ఇంటికి వచ్చేశాను. అదే సమయంలో తన పనిమీద వచ్చిన చెన్నై వచ్చిన గగన్.. నన్ను హోమ్లీ అవతారంలో చూసి మెస్మరైజ్ అయిపోయాడు. ముంబైలోని రెస్టారెంట్లో 3.36 కేరట్ల డైమండ్ రింగ్ ఇచ్చి మరీ ఓ బ్యాక్ గ్రౌండ్ సాంగ్ తో ప్రపోజ్ చేశాడు' అని చెప్పింది నికిత.

తనకు భక్తి ఎక్కువ అని గగన్ అర్ధం చేసుకున్నాడని.. తనతో తప్ప లైఫ్ ఇంకెవరితోనూ ఊహించుకోలేనని.. చెప్పేస్తోంది నికిత.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/