Begin typing your search above and press return to search.

యూట్యూబర్ అతి.. నిత్యను అస్సలు ప్రేమించడట

By:  Tupaki Desk   |   7 Aug 2022 4:30 PM GMT
యూట్యూబర్ అతి.. నిత్యను అస్సలు ప్రేమించడట
X
ఒక అర్థం పర్థం లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడటానికి వేదిక ఒకటి అందుబాటులోకి రావటం.. కోట్లాది మందికి తన మాటల్ని అందుబాటులో ఉంచటమే కాదు.. తాను చేసే వ్యాఖ్యలకు ప్రముఖులు ఇరుకున పడేలా చేసే మాధ్యమంగా మారింది సోషల్ మీడియా. ఒక విధంగా చూస్తే.. దాపరికం లేని సమాజం.. ఎవరి సంగతులైనా సరే.. అందరికి చూపించే అవకాశాన్ని సోషల్ మీడియా కల్పించింది. దీన్ని కొందరు సద్వినియోగం చేసుకుంటుంటే.. మరికొందరు దుర్వినియోగం చేస్తున్న పరిస్థితి. తాజాగా కేరళకు చెందిన సంతోష్ వర్కీ అనే యూట్యూబర్ ఒకరు ప్రముఖ నటి నిత్యా మీనన్ ను ప్రేమిస్తున్నట్లుగా పేర్కొనటం తెలిసిందే.

అయితే.. అతను తనను ప్రేమిస్తున్నారంటూ గడిచిన ఆరేళ్లుగా వేధిస్తున్నట్లుగా నిత్యా మీనన్ ఆరోపించింది. తనను ముప్ఫై నెంబర్లతో వేధింపులకు గురి చేసేవాడని వాపోయింది. తాజాగా ఒక సినిమా ప్రమోషన్స్ సందర్భంగా సంతోష్ గురించి ఆమె ఓపెన్ అయ్యారు. అయితే.. దీనిపై అతగాడి వాదన వేరుగా ఉంది. నిత్య చెప్పిన దాన్లో నిజం లేదని.. ఒకే వ్యక్తి పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు కొనుగోలు చేయగలరన్న దానిని తాను ప్రజలకే వదిలేస్తున్నట్లుగా పేర్కొన్నాడు.

నిత్యామీనన్ కు వేరే వ్యక్తితో ఎంగేజ్ మెంట్ అయినట్లు తల్లి చెబితే.. అలాంటిదేమీ లేదని తండ్రి చెబుతున్నారన్నారు. అంతేకాదు..తనపై లైంగిక వేధింపుల కేసు పెట్టాలని చూస్తున్నట్లుగా పేర్కొన్నారు. గతంలో తాను నిత్యామీనన్ ను పెళ్లి చేసుకోవాలన్న ఇష్టం ఉండేదని.. ఇప్పుడు అది లేకుండాపోయిందన్నారు. ''నేను చచ్చినా నిత్యామీనన్ ను పెళ్లి చేసుకోను' అని సంతోష్ నోటి నుంచి వస్తున్న వ్యాఖ్యలకు నెటిజన్లు నెగిటివ్ గా రియాక్టు అవుతున్నారు. అతగాడిదంతా ఓవర్ గా అభివర్ణిస్తున్నారు. అసలు నిన్ను నువ్వు చూసుకుంటున్నావా? నువ్వు నిత్యను రిజెక్టు చేయటం ఏమిటంటూ తిట్ట దండకం అందుకుంటున్నారు. మలయాళ సినిమాలకు రివ్యూలు చెప్పే యూట్యూబర్ గా సంతోష్ సుపరిచతుడన్న సంగతి తెలిసిందే. ఇతగాడి రచ్చ మరెంత కాలం సాగుతుందో చూడాలి.