Begin typing your search above and press return to search.

నల్లరంగు డ్రెస్సులో నాజూకుగా.. నివేదా పేతురాజ్!

By:  Tupaki Desk   |   20 May 2023 9:15 PM GMT
నల్లరంగు డ్రెస్సులో నాజూకుగా.. నివేదా పేతురాజ్!
X
నివేదా పేతురాజ్... ఒరు నా కూత్తు అనే తమిళ సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టింది. ఆ తర్వాత ఏడాదే మెంటల్ మదిలో అనే తెలుగు సినిమాతో టాలీవుడ్ లో కూడా కాలు మోపింది. ఆ తర్వాత టిక్ టిక్ టిక్, చిత్ర లహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురంలో, బ్లడీ మేరీ, విరాట పర్వం చిత్రాల్లోనూ మెరిసింది. విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన దాస్ కా ధమ్కీ చిత్రంలో హీరోయిన్ గా నటించి మెప్పించింది.

తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ తన అందం, అభినయంతో వరుస ఆఫర్లను అందిపుచ్చుకుంటుంది. ఇండస్ట్రీకి వచ్చిన ఏడేళ్లలోనే ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. ఓ వైపు వరుసగా చిత్రాలు చేస్తూ బిజీగా ఉంటూనే మరోవైపు అభిమానులకు అందుబాటులో ఉంటుంది. తనకు సంబంధించిన హాట్ హాట్ ఫొటోలను నెట్టింట పెడుతూ కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తుంటుంది.

అంతేకాకుండా తన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టా వేధికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో బ్లాక్ డ్రెస్ వేసుకున్న ఈ ముద్దుగుమ్మ మెరిసిపోతుంది. థిక్ రెడ్ కలర్ లిప్ స్టిక్, విత్ బ్లూ కలర్ డైమండ్ రింగ్ పెట్టుకున్నఈమె.. నలుపు రంగు డ్రెస్సు వేసుకొని ఫొటోలకు ఫోజులు ఇచ్చింది.

సింగిల్ పీస్ లాంగ్ ఫ్రాక్ లో నివేదా చాలా అందంగా కనిపిస్తోంది. లైట్ వైట్ కలర్ పెన్సిల్ హిల్స్ వేసుకొని స్ట్రెయిట్ స్లిట్ కట్ డ్రెస్సులో అందాలను ఆరబోసింది. బాడీ షేపులన్నీ పర్ ఫెక్ట్ గా కనిపించేలా ఉన్న ఈ డ్రెస్సులో నివేదా చందమామలా మెరిసిపోతుంది. ఈమె పొటోలు షేర్ చేసిన గంటలోపే వేలల్లో లైకులు వచ్చాయి. వందల్లో కామెంట్లు వచ్చాయి. అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

నల్ల రంగు డ్రెస్సులో నల్ల కలువలా ఉన్నావని కొందరు, చందమామలా మెరిసిపోతున్నావని మరికొందరు తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. ముద్ద బంతిలాంటి నీ మొహం చూస్తుంటే ముద్దు పెట్టుకోవాలని పిస్తుందంటూ ఓ నెటిజెన్ చెప్పుకొచ్చాడు.