Begin typing your search above and press return to search.

నటి నుస్రత్ జహాన్ వివాహం చెల్లదన్న కోర్టు

By:  Tupaki Desk   |   18 Nov 2021 7:31 AM GMT
నటి నుస్రత్ జహాన్ వివాహం చెల్లదన్న కోర్టు
X
బెంగాల్ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్, నిఖిల్ జైన్ ల వివాహం చట్టబద్దంగా చెల్లదని కోల్ కతా హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గతంలో జరిగిన వివాహం చెల్లదని.. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఆమె అఫిడవిట్ ను ఎలా పరిగణిస్తారని బీజేపీ కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు తీర్పును ప్రకటించింది.

నుస్రత్ జహాన్-నిఖిల్ జైన్ ల వివాహం టర్కీలో జరిగింది. అక్కడి సంప్రదాయం ప్రకారం చేసుకున్నారు. మతాంతర వివాహం భారతదేశంలో నమోదు కాలేదని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

లోక్ సభ అఫిడవిట్ లో నుస్రత్ జహాన్ తాను చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నట్టు ప్రకటించింది. వారిద్దరూ విడిపోయాక మాట మార్చింది. నిఖిల్ తో తన వివాహం టర్కీ చట్టం ప్రకారం జరిగిందని అందువల్ల భారతదేశంలో చెల్లుబాటు కాదని ప్రకటించింది. తన నిధులు దుర్వినియోగం అయ్యాయని నుస్రత్ ఆరోపించారు.

భారత్ లో తమ వివాహం చెల్లదని నుస్రత్ పేర్కొన్న తర్వాత, పెళ్లిని రిజిస్ట్రేషన్ చేయమని పలుసార్లు తాను నుస్రత్ ను అభ్యర్థించానని.. అయితే ఆమె తన అభ్యర్థులన్నింటిని తప్పించిందని నిఖిల్ పేర్కొన్నారు.


వ్యాపార వేత్త నిఖిల్ జైన్ తో తన వివాహం గురించి నుస్రత్ నోరువిప్పారు. టర్కీలో జరిగిన నా పెళ్లికి వారు హోటల్ బిల్లులు, ఖర్చులు కూడా చెల్లించలేదని నుస్రత్ ఆరోపించారు. వారికి నేను ఏమీ చెప్పనవసరం లేదు. నేను నిజాయితీపరురాలిని. నన్ను తప్పుగా చిత్రీకరించారు. ఇప్పుడు నేను ఇదే విషయాన్ని స్పష్టం చేయదలుకున్నాను. ఎవరి పేరు చెప్పకుండా ఇతరులను బాధ్యులను చేయడం.. తప్పుగా చూపించడం చాలా సులభం అని నుస్రత్ పేర్కొన్నారు.

ఇక నవంబర్ లో జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు హాజరవుతానని నుస్రత్ వెల్లడించారు. ఇటీవల తన స్నేహితురాలైన సినీ నటి స్రబంతి ఛటర్జీ బీజేపీ నుంచి బయటకు రావడంపై స్పందించారు. తాను ఎప్పుడూ రాజకీయ సలహా ఎవరికి ఇవ్వనని స్పష్టం చేసింది.

బెంగాల్ నటి అయిన నుస్రత్ జహాన్ గత పార్లమెంట్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. వ్యాపారవేత్త నిఖిల్ జైన్ ను 2019 జూన్ 19న టర్కీలో పెళ్లి చేసుకున్నారు. నవంబర్ 2020 నుంచి విభేదాల కారణంగా వారిద్దరూ విడిగా ఉంటున్నారు.

ఇటీవలే ఆగస్టు 26న నుస్రత్ మగబిడ్డకు జన్మనిచ్చింది. జనన ధృవీకరణ పత్రంలో యష్ దాస్ గుప్తాను తండ్రిగా చేర్చింది. భారతీయ చట్టాల ప్రకారం నిఖిల్ జైన్ తో తన వివాహం చెల్లదని.. కేవలం లివింగ్ రిలేషన్ షిప్ లో మాత్రమే ఉన్నానని నుస్రత్ గతంలో వెల్లడించి సంచలనం సృష్టించింది.