Begin typing your search above and press return to search.
మోదీకి వ్యతిరేకంగా ట్వీట్.. బిగ్ బాస్ బ్యూటీపై కేసు..?
By: Tupaki Desk | 15 Feb 2021 8:30 AM GMTప్రధాని నరేంద్రమోదీ తమిళనాడు పర్యటన సందర్భంగా.. కోలీవుడ్ నటి, తమిళ్ బిగ్ బాస్ ఫేమ్ ఓవియా హెలెన్ ఓ ట్వీట్ చేశారు. దీంతో.. ఆమెపై బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారని సమాచారం.
ఫిబ్రవరి 14వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ చెన్నైలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోలీవుడ్ యువ నటి ఓవియా ఓ ట్వీట్ చేశారు. #GoBackModi అంటూ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌పై తమిళ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. చెన్నై పోలీసులకు కంప్లైంట్ చేసినట్టు తెలుస్తోంది.
ఓవియా చేసిన ట్వీట్‌పై సైబర్ సెల్, సీబీ సీఐడీతో విచారణ జరిపించాలని బీజేపీ నేతలు కోరినట్టు సమాచారం. ఈ ట్వీట్‌పై బీజేపీ తమిళనాడు సెక్రెటరీ మాట్లాడుతూ.. ఓవియా ట్విట్ వెనుక చైనా, శ్రీలంక దేశాలకు చెందిన కొందరు ఉండవచ్చనే సందేహం వ్యక్తం చేశారు. దేశంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. అందుకు ఓవియా లాంటి సెలబ్రిటీలను ఉపయోగించుకొంటున్నారని ఆరోపించారు.
కాగా.. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు, సోషల్ మీడియా హెడ్ నిర్మల్ కుమార్ మాత్రం ఓవియాపై కేసు వార్తలను ఖండించారు. తమిళనాడులోని ఏ సెలబ్రిటీపై కూడా బీజేపీ నేతలు ఫిర్యాదు చేయలేదని ఆయన స్పష్టం చేశారు.
ఓవియా హెలెన్ సినీ కెరీర్ ను పరిశీలిస్తే.. ‘ఇది నా లవ్ స్టోరి’ అనే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంటరైంది ఓవియా. తమిళంలో 90ml, ముని-4, కాంచన-3, చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం రాజా భీమ, బ్లాక్ కాఫీ వంటి సినిమాలు చేస్తోంది ఓవియా.