Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : హాట్ బ్యూటీ ఫిజిక్ అదుర్స్

By:  Tupaki Desk   |   1 Oct 2021 4:30 PM GMT
ఫొటోటాక్‌ : హాట్ బ్యూటీ ఫిజిక్ అదుర్స్
X
బాలీవుడ్‌ హాట్ బ్యూటీ పరిణితి చోప్రా మూడు పదుల వయసు దాటినా కూడా అందం విషయంలో ఇంకా రెండు పదుల వయసు అమ్మాయి గానే కనిపిస్తుంది. ఆమె వయసు రెండు పదుల వయసు వద్ద ఆగిపోయిందా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేసేంత అందంగా కనిపిస్తూ ఉంది. నెట్టింట రెగ్యులర్ గా ఈ అమ్మడు అందాల ప్రదర్శణ చేస్తూ ఫొటోలు షేర్‌ చేస్తూనే ఉంది. ప్రొఫెషనల్‌ ఫొటో షూట్స్ తో పాటు మంచి హాట్ ఫొటోలను మరియు సెల్ఫీలను ఈ అమ్మడు నెట్టింట తన ఫాలోవర్స్ కోసం ఉంచుతుంది. ఇప్పటి వరకు ఈమె అందంను చూసిన అభిమానులు ఈసారి ఆమె ఫిజిక్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. స్కిన్ టోన్ ఎంత అద్బుతంగా ఉన్నా.. ప్రతిభ ఎంత ఉన్నా కూడా ఫిజిక్ విషయంలో ఆకట్టుకున్నప్పుడే హీరోయిన్ అంటే సార్థకం ఉంటుంది.

ఆ విషయంలో హాట్‌ బ్యూటీ పరిణితి చోప్రా ను ఖచ్చితంగా అభినందించాల్సిందే అంటున్నారు. హీరోయిన్స్ ఖచ్చితంగా వర్కౌట్స్ చేస్తారు. వారు వర్కౌట్స్ చేయకుంటే అంద అందంగా కనిపించరు. ఏడాదిలోనే బొద్దుగా మారిపోతారు. వర్కౌట్స్ చేయడం వల్ల చాలా మంది సన్నగా కనిపిస్తారు కాని కొందరు మాత్రమే మంచి ఫిజిక్ తో కనిపిస్తారు. వారిలో పరిణితి ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఈ అమ్మడు ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ ను కలిగి ఉంటుందని బాలీవుడ్‌ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ లో టాక్ ఉంది. తాజాగా ఈ పిక్ చూసిన తర్వాత అభిమానులు మరియు నెటిజన్స్ కూడా ఆమె అందంకు ఫిదా అవుతున్నామని కామెంట్స్ చేస్తున్నారు. మీ అందం అద్బుతం అన్నట్లుగా పలువురు కామెంట్స్‌ చేస్తూ ఉన్నారు.

తాజాగా ఈ అమ్మడు మాల్దీవ్‌ లకు వెళ్లింది. అక్కడ బీచ్ లో సన్ బాత్‌ ఇంకా ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు రెగ్యులర్‌ గా షేర్‌ చేస్తూనే ఉంది. తాజాగా ఈ ఫొటోను షేర్‌ చేసింది. బ్లూ స్కై ని హైలైట్‌ చేస్తూ తన వర్కౌట్‌ ను కొనసాగిస్తోంది. స్పోర్ట్స్ స్కట్‌ మరియు టాప్ లో ఉన్న ఈ అమ్మడు బీచ్ లో వర్కౌట్లు చేస్తున్నట్లుగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. మొత్తానికి హాట్‌ బ్యూటీ పరిణితి చోప్రా ఆకట్టుకునే రూపంతో మంచి ఫిజిక్ ను కూడా కలిగి ఉంది అంటూ ఈ ఫొటోకు నెటిజన్స్ పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్‌ లో వరుస సినిమాలతో ఆకట్టుకుంటున్న ఈ అమ్మడిని సౌత్‌ కు తీసుకు వచ్చేందుకు గతంలో ప్రయత్నాలు జరిగాయి. కాని ఆ సమయంలో ఆమె నుండి సిగ్నల్ రాలేదు. ఇప్పడు ఏదైనా ఆఫర్‌ సౌత్ నుండి వస్తే చేసేందుకు సిద్దం అన్నట్లుగా ఉందట.