Begin typing your search above and press return to search.

ఇసుకలో ఆడుకుంటూ.. బికినీతో సర్‌ప్రైజ్ చేసిన బ్యూటీ

By:  Tupaki Desk   |   3 Oct 2022 4:00 PM GMT
ఇసుకలో ఆడుకుంటూ.. బికినీతో సర్‌ప్రైజ్ చేసిన బ్యూటీ
X
బాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో స్టార్ హీరోలు మాత్రమే కాకుండా స్టార్ హీరోయిన్స్ కూడా రిజల్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత కొంతకాలంగా వరుస అపజయలను అందుకుంటున్న హీరోయిన్స్ లిస్టులో పరిణితి చోప్రా కూడా ఉంది. ఈ బ్యూటీ కెరీర్ స్టార్టింగ్ అయితే ఒక రేంజ్ లో మొదలైంది. ఎలాంటి సినిమా చేసిన కూడా బాక్సాఫీస్ వద్ద పెట్టిన పెట్టుబడిగా డబుల్ ప్రాఫిట్స్ అందించాయి. కానీ మూడేళ్ల తర్వాత మాత్రం అమ్మడి మ్యాజిక్ అంతగా క్రియేట్ అవ్వలేదు.

మంచి నటి అని గుర్తింపు అయితే చాలాసార్లు అందుకుంది. ఇషాక్ జాదే, కేసరి సినిమాలు ఆమెకు మంచి విజయాలను అంధించాయి. పరిణితి ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో తన పాత్రకు సరైన న్యాయం చేస్తుంది అని కూడా చాలామంది ఆమెతో వర్క్ చేసిన దర్శకులు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా పరిణితి చోప్రా గ్లామరస్ పాత్రల కంటే కూడా ట్రెడిషనల్ లుక్స్ తోనే ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాలలో ఆమె కనిపించే విధానం కూడా ఎంతో అర్థవంతంగా ఉంటుంది అని చెబుతూ ఉంటారు.

ఇక వెండితెరపై ఎక్కువగా ట్రెడిషనల్ లుక్స్ తోనే ఆకట్టుకున్న పరిణితి చోప్రా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు మాత్రం బికినీ అందాలతో షాక్ ఇస్తూ ఉంటుంది. రీసెంట్ గా ఈ బ్యూటీ మాల్దీవ్స్ కు వెళ్ళగా అక్కడ బీచ్ లో ఇసుకతో మెడలు కడుతూ నవ్వుతూ ఫోటోకు స్టిల్ ఇచ్చింది. ఇక ఆమె బికినీ అందాలు చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే.

అమ్మడు గతంలో చాలా సార్లు బికినీ వేసింది కానీ ఇప్పుడు మాత్రం అంతకంటే గ్లామరస్ గా ఉంది అని ఆమె ఫాలోవర్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక ఈ బ్యూటీ సినిమాల విషయానికి వస్తే చివరగా సైనా నెహ్వాల్ బయోపిక్ లో నటించింది. అయితే ఆ సినిమా దారుణాతి దారుణంగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది.

ఇక ఆ తర్వాత మళ్లీ ఎలాగైనా ఫామ్ లోకి రావాలి అని రెండు మూడు సినిమాలను ఎంతో ఆలోచించి సెలెక్ట్ చేసుకుంది. ఇక ప్రస్తుతం అయితే ఆమె తిరంగా అనే ఒక సినిమాలో నటిస్తుంది. అలాగే మరొక రెండు సినిమాలు కూడా ప్రొడక్షన్ దశలోనే ఉన్నాయి. మరి ఆ సినిమాలతో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.