Begin typing your search above and press return to search.

పాయ‌ల్ ఢిల్లీ వెళ్లిపోయిందా?

By:  Tupaki Desk   |   27 May 2023 1:21 PM GMT
పాయ‌ల్ ఢిల్లీ వెళ్లిపోయిందా?
X
ఢిల్లీ బ్యూటీ పాయ‌ల్ రాజ్ పుత్ `ఆర్ ఎక్స్ 100` తొలి సినిమాతో ఓ మెరుపు మెరిసిన సంగ‌తి తెలిసిందే. అమ్మ‌డి హాట్ అందానికి కుర్రాళ్లంతా ఫిదా అయ్యారు. అటుపై వ‌రుస అవకాశాల‌తో కొన్నాళ్లు బిజీగానే కనిపించింది. ఆ త‌ర్వాత అమ్మ‌డి వేగం ఒక్క‌సారిగా త‌గ్గింది. దీంతో కోలీవుడ్..శాండిల్ వుడ్ అంటూ రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణాన్ని కొన్నాళ్లు సాగించింది. ఇప్ప‌టికీ అలాగే కొన‌సాగుతుంది. అలాగ‌ని టాలీవుడ్ ని విడిచిపెట్ట‌లేదు. వ‌చ్చిన అవ‌కాశాలు స‌ద్వినియోగం చేసుకుంటుంది.

`కిరాతాక‌`..`మంగ‌ళ‌వారం` లాంటి రెండు సినిమాలు చేస్తుంది. ఈ రెండింటిలో మంగ‌ళ‌వారంపై అంచ‌నాలు బాగానే ఉన్నాయి. అజ‌య్ భూప‌తి తెర‌కెక్కిస్తున్న సినిమా కావ‌డంతో పాయల్ మ‌రోసారి హ‌ద్దులు చెరిపేసే న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటుంద‌న్న అంచ‌నాలున్నాయి. మంగ‌ళ‌వారం లాంటి టైటిల్ పై యువ‌త అంతే ఆస‌క్తిగా ఉంది. సినిమాలో ఏం చేప్ప‌బోతున్నారు? ఎం చూపించ‌బోతున్నారు? అంటూ ఒక‌టే ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు.

ఆ మ‌ధ్య గోదారి ప్రాంతంలో షూటింగ్ జ‌ర‌గ‌డంతో పాయల్ కోసం జ‌నాలు తండోప‌తండాలుగా త‌ర‌లి వ‌చ్చి చూసెళ్లారు. అది పాయ‌ల్ కి ఉన్న క్రేజ్. మ‌రి ఈ అమ్మ‌డు ఇప్పుడు హైద‌రాబాద్ లో ఉంటుందా? లేక ఢిల్లీ లో ఉంటుందా? అంటే మ‌కాం పూర్తిగా ఢిల్లీకి మార్చేసిన‌ట్లు తెలిసింది. షూటింగ్ ఉంటే ఉన్న‌న‌న్ని రోజులు హోట‌ల్ లో ఉండ‌టం త‌ర్వాత తిరిగి ఢిల్లికి వెళ్లిపోవ‌డం చేస్తుందిట‌. బిజీగా ఉన్నంత కాలం హైద‌రాబాద్ లోనే ప్లాట్ తీసుకుని ఉంది.

ఇక్క‌డ నుంచే చెన్నై కి వెళ్లేది. అయితే ఇప్పుడు ఢిల్లీ నుంచి దేశం మొత్తం తిరిగేస్తుందిట‌. లొకేష‌న్ స్పాట్ కి నేరుగా ఢిల్లీ నుంచే చేరుకుంటుందిట‌. ఢిల్లీలో ఉంటే త‌ల్లిదండ్రుల‌తో స‌మ‌యం గ‌డపొచ్చ‌ని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తుంది. అలాగే బ్యూటీకి ఫ్యామిలీతో బాండింగ్ కూడా ఎక్కువ‌గానే ఉంటుందిట‌. ఇంట్లో ఉన్నా! బ‌య‌ట షికార్లు అంటూ తిర‌గ‌డం చాలా త‌క్కువ‌ట‌. స్నేహితుల‌తో బ‌య‌ట‌కు వెళ్ల‌డం చాలా రేర్ అట‌.