Begin typing your search above and press return to search.

కెరియర్ కోసం చేతబడి చేయించానంటూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

By:  Tupaki Desk   |   28 March 2022 2:30 PM GMT
కెరియర్ కోసం చేతబడి చేయించానంటూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
X
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాలిటీ షో... లాకప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఎప్పుడూ సంచలానత్మక సీక్రెట్లను బయట పెట్టే ఈ షో కంటెస్టెంట్లపై ఏ రేంజ్ లో క్రేజ్ వచ్చిందో కూడా అందరికీ తెలిసిన విషయమే.
అయితే ఎప్పుడూ ఏదో ఒక కొత్త వార్తతో ప్రేక్షకులను అలరించే ఈ షోలో తాజాగా హీరోయిన్ పాయల్ రోహత్గి ఓ భయంకరమైన సీక్రెట్ ను వెల్లడించారు. అయితే ఎలిమినేషన్ నుంచి తప్పించుకునేందుకే ఆమె ఇంత పెద్ద సీక్రెట్ ను బయట పెట్టింది. అయితే ఈ సీక్రెంట్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

15 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న పాయల్ రోహత్గి... ఒకానొక సమయంలో తన కెరియర్ డల్ అయిపోతుంటే విపరీతంగా భయపడి పోయిందట. ఇక తనకు అవకాశాలు రావేమోనని తెగ బెంగ పడిపోయిందట. అయితే ఏం చేయాలో తెలియక చాలా రోజుల పాటు తనలో తనే బాధపడిందట. కానీ తన కెరియర్ ను పుంజుకునేలా చేయడానికి తాను చేతబడి చేసిందట. ఇందుకోసం ఢిల్లీలోని ఓ పూజారి సాయంతో చేతబడిలోని వశీకరమం అనే తాంత్రిక విద్యను కూడా నేర్చుకుందట.

దాన్ని ప్రయోగించిందట కూడా. కానీ దాని వల్ల తనకు ఎలాంటి లాభం జరగలేదని వెల్లడించింది. కానీ తన కెరియర్ ను కాపాడుకునేందుకు వశీకరణం చేసినట్లు తెలిస్తే... తనను చులకున చేసి మాట్లాడతారనే భయంతో ఇన్నాళ్లూ ఈ విషయాన్ని బయట పెట్టలేకపోయానని హీరోయిన్ పాయల్ రోహత్గి వివరించింది.

బహూశా ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్న వాళ్లలో కూడా కొంత మంది నన్ను చులకన చేసి మాట్లాడొచ్చంటూ వెల్లడించింది. అంతే కాకుండా చదువుకున్న అమ్మాయిలు, ఉద్యోగం చేసే మహిళలు ఇలాంటివి నమ్మకపోవచ్చని వెల్లడించింది. ఒక వేళ నమ్మితే చేతబడి చేయించినా ఆ విషయాన్ని గుట్టుగా దాచి పెడతారని పాయల్ రోహత్గి స్పష్టం చేసింది.

అయితే పాయల్ రోహత్గి చెప్పిన ఈ రహస్యాన్ని విని యాంకర్ కంగనా రనౌత్ బిగ్గరగా నవ్వేసింది. నీకు అందంతో పాటు టాలెంట్ కూడా ఉందంటూ కామెంట్లు చేసింది. అలాగే నీకు ఇలాంటి మంత్ర తంత్రాలు అవసరం లేదని స్పష్టం చేసింది. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా ఏదో చేతబడి చేశానని ఆరోపించారని.. ఒక అమ్మాయి సక్సెస్ అందుకుంటే జనాలు ఆ విజయాన్ని కూడా శంకిస్తారంటూ కంగనా వివరించింది. అయితే నీవు ఇంత పెద్ద సీక్రెట్ చెప్పి నీ ధైర్యాన్ని చాటుకున్నావంటూ పాయల్ రోహత్గిని ప్రశంసలతో ముంచెత్తింది.

కాకపోతే నువ్వు సంగ్రమ్ ను పెళ్లి చేసుకోవాలనుకున్నావు కదా... మరి ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్న అతను నేనో మాంత్రికురాలిని ప్రేమించానని అతడు అనుకోడా అంటూ పాయల్ ను ప్రశ్నించింది కంగనా. దీనికి స్పందించిన ఆమె... అతడు ఏం అనుకుంటే అది అనుకొని.. తనకు ఏది నమ్మాలనిపిస్తే అదే నమ్మని. కానీ నేను ఆ చేతబడి అతడిపై మాత్రం చేయలేదని పాయల్ రోహత్గి వివరించింది.