Begin typing your search above and press return to search.

తల్లిగా మారిన హీరోయిన్ పూజాకుమార్.. భర్త కూతురుతో పిక్!!

By:  Tupaki Desk   |   2 Jan 2021 5:30 PM GMT
తల్లిగా మారిన హీరోయిన్ పూజాకుమార్.. భర్త కూతురుతో పిక్!!
X
తెలుగులో విశ్వరూపం, గరుడవేగా సినిమాలతో పాపులారిటీ సొంతం చేసుకున్న హీరోయిన్ పూజా కుమార్. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న పూజా.. ఇటీవల పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ మేరకు ఆమె భర్త విశాల్ జోషితో కలిసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతేగాక తమ కూతురుతో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్ చేసి ఈ విషయాన్నీ ప్రకటించింది. ఈ సందర్బంగా పూజా దంపతులు తమ బిడ్డకు నావ్య జోషి అని పేరు పెట్టినట్లు తెలిపింది. ఇక తమ కూతురు ఫోటో పోస్ట్ తో పాటు పూజా భర్త విశాల్ ఇలా నోట్ రాసాడు.

“ఇదివరకు మేము ఇద్దరమే.. కానీ ఇప్పుడు మేము ముగ్గురం. పూజా, నేను మా కూతురు నావ్య జోషిని మీ అందరికి పరిచయం చేస్తుంనందుకు చాలా సంతోషిస్తున్నాము. నేను కలలు కన్న ఉత్తమ జీవిత భాగస్వామిగా, నా బుజ్జి కూతురు నావ్యను ఈ ప్రపంచంలోకి తీసుకు వచ్చినందుకు భార్య పూజాకు ధన్యవాదాలు. ఈ పుట్టినరోజును నా ఉత్తమ పుట్టినరోజుగా చేసుకున్నాను. మీ ఇద్దరినీ చాలా ప్రేమిస్తున్నాను" అంటూ తన కూతురు, భార్య పై ప్రేమను బయట పెట్టాడు విశాల్. ఇక విశాల్ జాయ్.. మ్యారేజ్ మేనేజ్మెంట్ సంస్థ జాయ్ కి సిఈఓ. ప్రస్తుతం విశాల్, పూజా అమెరికాలో నివసిస్తున్నారు. పూజా తన సోషల్ మీడియా ఖాతాలలో ఈ వార్తలను అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ఇక కెరీర్ పరంగా, పూజా చివరిసారిగా ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన జీ5 వెబ్ ఫిల్మ్ అనామికలో కనిపించింది. ప్రస్తుతం పూజా ఇంటిపట్టునే ఉంటున్నట్లు సమాచారం.