Begin typing your search above and press return to search.
పూనమ్ ని ఒంటరిగా కలవమన్న నిర్మాత
By: Tupaki Desk | 22 July 2018 10:06 AM GMTతెలుగు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎవరో ఒకరు - ఏదో రకంగా కామెంట్ చేస్తూనే ఉండటంతో ఇప్పట్లో ఆ చిచ్చు చల్లారే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా కథానాయిక పూనమ్ కౌర్ ఓ స్టార్ ప్రొడ్యూసర్ గురించి ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. పేరు బయటికి చెప్పకుండా... ఒక నిర్మాత ఇంటికొచ్చి నన్ను ఒంటరిగా కలమన్నాడని ఆమె చెప్పారు. తీరా తన తల్లితో కలిసి ఆ నిర్మాత దగ్గరికి వెళితే చిరాకు పడ్డాడని - సరిగ్గా మాట్లాడలేదని ఆమె కామెంట్లు చేసింది. ఆ కామెంట్లు విన్నవాళ్లంతా పూనమ్‌ని ఇంటికి పిలిచిన ఆ నిర్మాత ఎవరా అని ఆరా తీస్తున్నారు.
తెలుగులో పలు చిత్రాల్లో నటించిన కథానాయిక పూనమ్. ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో నటిస్తోంది. ఇటీవల ఓ నిర్మాత పూనమ్ ఇంటికి వెళ్లి... మీరు చాలా బాగా నటిస్తారని - స్టార్ హీరోల సరసన నటించే అవకాశం కల్పిస్తానని చెప్పారట. ఒకసారి ఒంటరిగా వచ్చి కలమన్నారట. తీరా తన తల్లితో వెళ్లేసరికి ఆనిర్మాత మొహం చాటేసినంత పనిచేశాడని - స్టార్ హీరోయిన్లు కూడా బయటికి సంతోషంగా కనిపిస్తున్నా.. లోపల మాత్రం ఇలాంటి ఇబ్బందులు పడుతూనే ఉన్నారని ఆమె చెప్పుకొచ్చారు. అలాగే హీరోలు వయసుకు తగ్గట్టుగా పెళ్లి చేసుకొని కెరీర్ కొనసాగిస్తున్నారని.. హీరోయిన్లు మాత్రం కెరీర్ కోసం వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.