Begin typing your search above and press return to search.

అలాంటి పాత్రలు చేసినందుకు బాధపడ్డాను: నటి ప్రగతి

By:  Tupaki Desk   |   1 Jun 2022 10:30 AM GMT
అలాంటి పాత్రలు చేసినందుకు బాధపడ్డాను: నటి ప్రగతి
X
తెలుగు సినిమాల్లో అమ్మ పాత్రలకి ఒకప్పుడు నిర్మలమ్మ .. ఆ తరువాత అన్నపూర్ణమ్మ కేరాఫ్ అడ్రెస్ గా ఉంటూ వచ్చారు. ఆ తరువాత అమ్మ పాత్రను కూడా అందంగా చూపించేలనే కాన్సెప్ట్ మొదలైంది. దాంతో సీనియర్ హీరోయిన్స్ రంగంలోకి దిగడం మొదలుపెట్టారు.

అలాగే సీరియస్ గా సీరియల్స్ చేసుకుంటున్నవారు కూడా సినిమాల్లోని అమ్మ పాత్రల వైపు ఒక లుక్ వేశారు. అలా అందమైన అమ్మగా మార్కులు కొట్టేసినవారిలో ప్రగతి ఒకరుగా కనిపిస్తారు. 'ఎఫ్ 2'లో తమన్నా-మెహ్రీన్ లకు తల్లిగా ప్రగతి పోషించిన పాత్రకి మంచి మార్కులు పడ్డాయి.

'ఎఫ్ 3' సినిమాలోనూ ఆమె పాత్రకి అదే స్థాయి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా సక్సెస్ మీట్లో ప్రగతి మాట్లాడుతూ .. "నేను ఈ రోజున చాలా మాట్లాడుకుంటున్నాను. చాలా సినిమాలు చేసినప్పటికీ నాకు తగిన మంచి కేరక్టర్స్ పడలేదే అనే ఒక వెలితి ఎప్పుడూ ఉంటూ వచ్చింది. సరైన పాత్రలు రాకపోతుండటంతో మధ్యలో బ్రేక్ తీసుకోవడం కూడా జరిగింది. అలాంటి పరిస్థితుల్లో 'ఎఫ్ 2' సినిమాతో దేవుడు ఒక బ్లెస్సింగ్ ఇచ్చాడు. ఇలాంటి ఒక అవకాశం కోసం ఎన్నో ఏళ్లుగా నేను వెయిట్ చేస్తూ వచ్చాను.

కాఫీలు ..టీలు సప్లై చేయడం ..విలన్ పక్కన నుంచోవడం ..అందమైన అమ్మ ..సెట్ ప్రోపర్టీలానే చాలా సినిమాలను చేశాను. మంచి పాత్రలు వస్తాయనే ఆశతో .. నమ్మకంతో ఎదురుచూశాను. 'ఎఫ్ 2' సినిమాతో అది నిజమైంది.

వెంకటేశ్ గారి విషయానికి వస్తే ..ఆయన చాలా సింపుల్ గా ఉంటారు. సెట్లో ఆయన ఇన్వాల్వ్ మెంట్ .. టైమింగ్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆయనలాంటి ఒక ఆర్టిస్టు నేను చూడలేదు. ఇక రాజేంద్ర ప్రసాద్ గారు సెట్లో చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఆయన ఓ చంటిపిల్లాడిగా అనిపిస్తారు. ఆయన దగ్గర నాకు బాగా నచ్చిన విషయం ఆయన డిసిప్లిన్.

ఈ సినిమాతో అన్నపూర్ణమ్మ .. వై.విజయమ్మ అనే ఇద్దరు అమ్మలు నాకు దొరికారు. అలాగే వరుణ్ తేజ్ కూడా సినిమాకి .. సినిమాకి ఎదుగుతూ వస్తున్న తీరు సంతోషాన్ని కలిగిస్తోంది. అనిల్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మాటలు రావడం లేదు.దిల్ రాజు - శిరీష్ ఇద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం అంకితభావంతో పని చేశారు. అందువల్లనే ఈ సినిమా ఇంతటి సక్సెస్ ను సాధించింది" అని చెప్పుకొచ్చారు.